ఈ 5 అలవాట్లతో కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోండి..!

Divya
మన శరీరం ప్రతిభాగం ఆరోగ్యం, కిడ్నీ పనితీరుపై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి లేదు.మనం తిన్న ఆహారంలోని మలినాలన్నీ బయటికి పంపించడానికి కిడ్నీ వడపోత కార్యక్రమం చేస్తూ ఉంటుంది.ఈ కిడ్నీ పనితీరు దెబ్బతింటే మాత్రం మన శరీరంలోని వ్యర్థం అంతా బయటికి వెళ్లిపోకుండా అనేక రోగాలకు దారితీస్తుంది.చాలామంది వారి అలవాట్ల కారణంగా కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ చేసుకుంటూ,ఆ బాధ భరించలేక చాలా ఇబ్బంది పడుతుంటారు.కావున కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం మన కర్తవ్యం.మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్నిరకాల ఆహార అలవాట్లు చాలా బాగా ఉపయోగపడతాయి, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సరిపడా నీళ్లు తాగడం..
మన శరీరానికి కావాల్సిన నీళ్లు తాగుతుండాలి.అలా అని ఎక్కువ నీరు తాగకూడదు మరియు తక్కువ నీరు తాగకూడదు.ఎక్కువ నీరు తాగడం వల్ల,వాటిని పిల్టర్ చేయడానికి కిడ్నీలపై భారం పడుతుంది.తక్కువ నీరు త్రాగితే మలినాలు సరిగా ఫిల్టర్ కావు,దీనితో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.కావున ఈ రెండు అలవాట్లు అంత మంచిది కాదు.
సరియినా ఆహారం..
ఆరోగ్యానికి సహాయపడే మంచి ఆహారాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల అందులో అధికంగా ఉన్న ఉప్పు,కారాలు కిడ్నీ పనితీరుని దెబ్బతీస్తాయి.మరియు దీనివల్ల బీపీ,ఉబకాయం,మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.మనం రోజు వారి ఆహారంలో కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు మరియు ధాన్యాలు తీసుకోవడంతో కిడ్నీ పనితీరు మెరుగ్గా ఉంటుంది.
అధికంగా మందులు వాడడం..
చాలామంది నొప్పి వేయగానే వెంటనే మందులను వేసుకుంటూ వుంటారు.ఆ మందుల్లోని యాంటీ బయాటిక్స్ అధికంగా ఉండడం వల్ల,కిడ్నీ పనితీరు మందగిస్తుంది.కావున పెయిన్ కిల్లర్స్ మరియు ఆంటీ బయోటిక్స్ అధికంగా వేసుకోకపోవడం చాలా మంచిది.
ఆల్కహాల్ త్రాగటం..
ఆల్కహాల్ అధికంగా తాగడం వల్ల కూడా కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది.మరియు ధూమపానం చేయడం వల్ల రక్త సరఫరా సక్రమంగా జరగక,మూత్రపిండాలలో రాళ్లు వంటి సమస్యలు అధికమవుతాయి.కావున వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: