సహజ సిద్ధంగా అధిక బరువు తగ్గాలంటే?

Purushottham Vinay
అధిక బరువుని చాలా ఈజీగా తగ్గించడంలో కీరదోస ఇంకా అలాగే అల్లం మనకు చాలా బాగా సహాయపడతాయి.అల్లం ఇంకా కీరదోస మనకు చాలా సులభంగా లభించేవే.అలాగే ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి. అల్లంలో చాలా పోషకాలు ఇంకా ఔషధ గుణాలు ఉంటాయి.మీరు అల్లాన్ని ఉపయోగించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా తగ్గుతుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. తల తిరగడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంకా కీరదోస కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. ఇంకా దీనిలో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇంకా అలాగే ఒత్తిడిని తగ్గించడంలో ఇలా చాలా రకాలుగా కీరదోస కూడా  సహాయపడుతుంది. అల్లం, కీరదోసతో మనం జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఖచ్చితంగా చాలా సులభంగా బరువుని తగ్గవచ్చు.


మీరు ముందుగా కీరదోసపై ఉండే చెక్కును తీసేసి దానిని ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి.ఆ తరువాత ఒకటిన్నర ఇంచుల అల్లం ముక్కను తీసుకుని దానిని శుభ్రం చేసి ముక్కులగా చేసుకుని మీరు జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత దీనిని మీరు వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. రుచి కోసం మీరు ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇక ఇలా తయారు చేసుకున్న జ్యాస్ ను ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. అయితే పరగడుపున కుదరని వారు అల్పాహారానికి అర గంట ముందు అయినా దీనిని తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఇంకా అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల చాలా సులభంగా సహజ సిద్దంగా అధిక బరువుని తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: