పరగడుపున దీన్ని తాగితే బరువు ఈజీగా తగ్గుతారు?

Purushottham Vinay
చాలా మంది కూడా తమ బరువును తగ్గించేందుకు మందులను వాడుతూ ఉంటారు. అయితే మందులను వాడడం వల్ల బరువు తగ్గినప్పటికి  చాలా దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి  సహజ సిద్దంగా బరువును తగ్గించుకోవడం చాలా అవసరం. బరువు తగ్గడంలో మనకు సోంపు గింజలు చాలా బాగా సహాయపడతాయి.ఈ సోంపు గింజలను మనం వంటల్లో వాడుతూ ఉంటాం. సోంపు గింజలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయన్న సంగతి  తెలిసిందే.వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు మనం చాలా సులభంగా బరువు  తగ్గవచ్చు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు సోంపు గింజలను వాడడం చాలా మంచిది.సోంపు గింజలతో చక్కటి పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు సోంపు గింజలను ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి రాత్రంతా కూడా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని సోంపుతో సహా గిన్నెలో పోసి బాగా మరిగించాలి.


ఈ నీళ్లు సగం గ్లాస్ అయ్యే దాకా మరిగించిన తరువాత దీనిని గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే దాకా ఉంచాలి. ఇక ఈ కషాయం గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలపాలి.ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజూ ఉదయం పూట పరగడుపున తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.అయితే దీనిని క్రమం తప్పకుండా 45 రోజుల పాటు తాగాలి. ఇలా తాగడం వల్ల మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఈ పానీయాన్ని తాగుతూనే జంక్ ఫుడ్ కు చాలా దూరంగా ఉండాలి. అలాగే వంటల్లో నూనెను తక్కువగా ఉపయోగించాలి. ప్రతిరోజూ ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఈ విధంగా సోంపు గింజల నీటిని తాగడం వల్ల మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. సోంపు గింజల నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇంకా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.అలాగే రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఈ విధంగా సోంపు గింజలను వాడడం వల్ల మనం చాలా ఈజీగా బరువు  తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: