రెడ్ మీట్: ఎక్కువగా తింటే కలిగే నష్టాలు?

Purushottham Vinay
మన శరీరం ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా అందుకు కావలసిన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో మంచి మొత్తంలో పోషకాలను పొందడానికి మాంసాహారం అనేది మంచి ఎంపిక. కానీ చాలా మంది కూడా దీన్ని అతిగా తింటారు. దీన్ని మితంగా తింటే కలిగే లాభాలు కంటే అతిగా తినడం వల్ల కలిగే నష్టాలే ఎక్కువ.మాములుగా మాంసాహారం  అనేది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల పనితీరు సక్రమంగా ఉండాలంటే ఖచ్చితంగా రెడ్ మీట్ ని తినాలి. అయితే మటన్ ఎక్కువగా తింటే బోన్స్‌పై సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దీనిలో చెడు కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచడంతో పాటు గుండె నాళాలను ఈజీగా దెబ్బతీస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.దాని ఫలితంగా గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఉంటుందట. ఇంకా అదే సమయంలో ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక రెడ్ మీట్ ఎక్కువగా తినే వారి రక్తంలో ఖచ్చితంగా ఆమ్లత్వం పెరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల పోషకాలను మన శరీరం సంగ్రహించలేదు. 


ఇంకా అలాగే ఎసిడిక్ బ్లడ్ కారణంగా ఎముకలపై తీవ్ర ప్రభావం పడి, అవి బలహీనంగా మారే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే రక్తంలో ఆమ్లత్వం కనుక పెరిగితే, ఇది ఎముకల నుంచి కాల్షియం తొలగిపోయేందుకు ఖచ్చితంగా దారితీస్తుంది.అయితే మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వివిధ రూపాల్లోని ప్రొటీన్‌ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాల వంటి డెయిరీ పదార్థాలు, చేపలు, చికెన్ ఇంకా ప్రొటీన్ ఉండే మొక్కలను డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో పాటు పండ్లు, కూరగాయలు ఇంకా తృణ ధాన్యాలతో బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. బీన్స్, పప్పులు, ఆకు కూరలను ఆహారంగా తినాలి. ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్స్‌పై అవగాహన పెంచుకోవడం చాలా మంచిది. దీనివల్ల చాలా అదనపు ప్రయోజనాలు ఉంటాయి. పైగా మాంసంతో పోలిస్తే వీటికయ్యే ఖర్చు కూడా తక్కువే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: