కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసే సూపర్ డ్రింక్ ఇదే?

Purushottham Vinay
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు చాలామంది చాలరకాల టిప్స్ చెబుతుంటారు.అయితే ఏ టిప్ పనిచేసినా చేయకపోయినా..మజ్జిగ మాత్రం చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల కొలెస్ట్రాల్‌తో పాటు శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు కూడా తొలగిపోతాయి.స్థూలకాయం అనేది ఈమధ్య జీవనశైలిలో ప్రధానంగా కన్పిస్తున్న సమస్య. చెడు జీవనశైలి ఇంకా ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమనడంలోఎటువంటి సందేహం అవసరం లేదు. శరీర బరువు అనేది సీజన్‌ను బట్టి కూడా పెరుగుతుంటుంది. అంటే వేసవితో పోలిస్తే చలికాలంలో బరువు ఎక్కువ పెరగడం జరుగుతుంది. ఇందుకు కారణం ఒక్కటే. ఆయిలీ పదార్ధాలు ఎక్కువగా తీసకోవడం ఇంకా ఫిజికల్ యాక్టివిటీ లోపించడం. అందుకే ఎప్పటికప్పుడు అంటే సకాలంలో శరీరంలోని కొలెస్ట్రాల్ ని కనుక తగ్గించగలిగితే..గుండె సంబంధిత వ్యాధులు ఇంకా అలాగే అధిక రక్తపోటు ఈజీగా తగ్గిపోతుంది. 


కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మజ్జిగ చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక మజ్జిగలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్లు, పొటాషియం, ఫాస్పరస్, గుడ్ బ్యాక్టీరియా, ల్యాక్టిక్ యాసిడ్ ఇంకా అలాగే కాల్షియం వంటి ఆరోగ్యకరమైన గుణాలున్నాయి. ఇవి శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్‌ను చాలా ఈజీగా బయటకు పంపించడంలో సహాయపడతాయి. మజ్జిగను క్రమం తప్పకుండా డైట్‌లో భాగం చేసుకుంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.అయితే అదే పనిగా మజ్జిగ సేవించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యపరంగా నష్టం కలుగుతంది. ఎందుకంటే ఈ మజ్జిగలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారికి ఇది ఖచ్చితంగా హాని చేకూరుస్తుంది. జలుబు వంటి సమస్యలున్నప్పుడు కూడా మజ్జిగ తాగడం మంచిది కాదు. ఎలర్జీ ఉన్నవాళ్లు కూడా మజ్జిగకు చాలా దూరంగా ఉండాలి.కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గి ఎల్లప్పుడూ ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకి ఒక్కసారి మజ్జిగని తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: