టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా..?

shami
ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు జాబ్ చేసిన వాళ్లు.. ఇంట్లో ఉన్న లేడీస్ ఇలా అందరు తాగే ఒకే ఒక్క పానీయం టీ, కాఫీ. వేడి వేడి టీ గానీ కాఫీ గానీ తాగనిదే రోజు మొదలు పెట్టని వారు ఎంతోమంది ఉంటారు. ఆఫీస్ లో వర్క్ బిజీగా ఉంటే అప్పటికప్పుడు ఓ టీ లేదా కాఫీ పడితే మాత్రం కొద్దిగా రిలాక్స్ అనిపిస్తుంది. అయితే టీ, కాఫీ తాగే ముందు మామూలుగా నీళ్లు తాగుతారు. కానీ కొందరు టీ, కాఫీ తాగిన తర్వాత వెంటనే నీళ్లు తాగుతారు. అలాంటి వారికి రిస్క్ తప్పదని అంటున్నారు.
టీ లేదా కాఫీ తాగక ముందు నీళ్లు తాగిన పర్లేదు కానీ అవి తాగిన తర్వాత మాత్రం నీళ్లు తాగక కూడదట. వేడి వేడి టీ తాగిన తర్వాత వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో మార్పులు వస్తాయని. దాని వల్ల అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అంతేకాదు టీ, కాఫీ తాగిన వెంటనే వాటర్ తాగడం వల్ల దంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా టీ, కాఫీ తాగిన తర్వాత వాటర్ తాగితే కడుపులో అల్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట.
ఇదే కాకుండా గొంతు నొప్పి కూడా వస్తుందని అంటున్నారు. టీ, కాఫీ తాగే ఒక అర గంట ముందు నీళ్లు తాగి టీ తాగిన గంట తర్వాత వాటర్ తాగొచ్చని అంటున్నారు. సో ఎలా చూసినా సరే టీ, కాఫీతో పాటుగా నీళ్లు అసలు తాగకూడదని తెలుస్తుంది. రిఫ్రెష్ కోసం తాగే టీ వల్ల ఎంతోకొంత లాభాలు ఉన్నా అది తాగాక వాటర్ తాగడం అనేది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. మరి మీకు టీ తాగే అలవాటు ఉంటే వాటర్ విషయంలో కాస్త టైం తీసుకుంటే బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: