
మహిళలు పెళ్లయిన తర్వాతే ఎందుకు బరువు పెరుగుతారంటే..?
పెళ్లి తర్వాత చాలామంది అమ్మాయిలు తరచుగా ఇంటి పనుల్లో, ఆఫీస్ వర్క్ లో బిజీగా గడుపుతారు. పిల్లలు, కుటుంబ సభ్యులు అంటూ వారికే సమయాన్ని కేటాయిస్తారు. కానీ తమకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోకపోవడం, ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం వల్లే బరువు పెరుగుతారు. సరైన సమయానికి భోజనం చేయకపోతే అసిడిటీ పెరిగి బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరొకవైపు పెళ్లి జరిగిన తర్వాత కొత్తలో చాలా రకాల ఆచారాల ప్రకారం చాలా వరకూ పార్టీలు జరుపుకోవడం, బంధువుల ఇళ్లకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు.. కాబట్టి ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన మీద కూడా అమ్మాయిలు ఎక్కువగా భుజిస్తారట. ఈ కారణంగా కూడా వారు బరువు పెరుగుతారని సమాచారం. ముఖ్యంగా అదనపు భారం వారిపై పడినప్పుడు కూడా వారు బరువు పెరుగుతారని వైద్యులు సూచిస్తున్నారు. పెళ్లయిన తర్వాత బరువు బాధ్యతలు పెరిగి.. సరైన సమయానికి తిండి లేక నిద్ర లేఖ డిప్రెషన్ కి గురవుతారు అని.. అలాంటి సమయంలో కూడా బరువు పెరుగుతారని.. శరీర హార్మోన్ల మార్పులు సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి సందర్భంలో అయినా సరే బరువు పెరగకుండా ఫిట్నెస్ ను మెయింటైన్ చేయవచ్చు.