
కడుపుతో వున్న మహిళ పచ్చికొబ్బరి తింటే ఏమవుతుందో తెలుసా..!
వాంతులు వికారం తగ్గించుకోవడానికి..
కడుపుతో వున్నప్పుడు ఎక్కువగా ఇబ్బందిపెట్టే వాంతులు,వికారం ఫీలింగ్ ను కొబ్బరిలో ఉండే ల్యూరిక్ యాసిడ్ తగ్గిస్తుంది.అలాగే గ్యాస్ , గుండె మంటను తగ్గించడంలో సహాయం చేస్తుంది.
పొట్టపై దురదతగ్గించుకోవడానికి..
కడుపుతో వున్నప్పుడు, పొట్టపై దురదగా అనిపిస్తూ ఉంటుంది.దానిని తగ్గించుకోవడానికి కొబ్బరి నూనే చాలా బాగా సహాయపడుతుంది.మరియు స్ట్రెచ్ మర్క్స్ ని తగ్గిస్తుంది.
రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి..
ఈ సమయంలో వివిధ ఆహారాల వల్ల, ట్యాబ్లేట్స్ వాడటం వల్ల 50 శాతం రక్తం తగ్గి,కాళ్లలో వాపులు వస్తాయి. అలాంటి వారు పచ్చికొబ్బరి తినడం వల్ల రక్తం వృద్ధి చెంది, వాపులను తగ్గిస్తుంది.
యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి..
గర్భ ధారణ సమయంలో కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవడం వల్ల యూరిన్ ఎక్కువగా వెళ్తారు. దానితో బ్యాక్టీరియా బయటకి పోయి,యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా సహాయం చేస్తాయి.
రక్త హీనతను తగ్గించుకోవడానికి..
ఈ సమయంలో ఎక్కువగా బాధపడే సమస్య రక్తహీనత. అలాంటి వారు పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల, ఇందులోని ఐరన్ రక్త వృద్ధికి దోహదపడుతుంది.
జీర్ణ శక్తి మెరుగుపర్చుకోవడానికి..
కొబ్బరినీళ్లతో పాటు, పచ్చి కొబ్బరి తమ డైట్ లో చేర్చుకోవడం వల్ల, ఈ సమయంలో బాధించే మలబద్ధకంను అరికట్టవచ్చు. ఇన్ని ప్రయోజనాలు కలిగిన కొబ్బరి పదార్థాలను గర్భిణీ స్త్రీలు రోజువారీ ఆహారంలో తీసుకోవడం ఉత్తమం..