
అనాసపండు తో ఈ రోగాలన్నీ పరార్..!
అనాస పండులో విటమిన్ ఎ మరియు బీటా కరోటిన్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలు కళ్ళకు చాలా మంచిది.అనాస పండులో ఉండే విటమిన్ సి కంటెంట్ చాలా విలువైనది.శరీరంపై ఏర్పడే గాయాలను చర్మ సమస్యలను సత్వరం తగ్గిస్తుంది.ఇందులో ఉండే పొటాషియం గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. రక్తపోటు రాకుండా కాపాడుతుంది. కాపర్ , ఎర్ర రక్తకణాలు అభివృద్ధికి సహాయపడుతుంది.మాంగనీస్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో తోడ్పడుతుంది.
కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడే వారి పాలిట అనాస పండు గొప్ప వరంగా చెప్పవచ్చు.ఇందులో విటమిన్ సి మరియు మాంగనీస్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది వయస్సు పైబడటం వల్ల వచ్చే ఎముకల వ్యాధుల నుండి కాపాడడానికి సహాయపడుతుంది. అనాస పండులో బ్రొమిలైన్ అనే ఎంజైము ఉంటుంది. ఇది తీసుకున్న ఆహారాన్ని ప్రోటీన్లుగా మార్చి జీర్ణం చేస్తుంది. అందువల్ల అజీర్తికి ఇది ఒక చక్కని మందు అని చెప్పవచ్చు.అంతేకాకుండా సైనటీస్,గొంతు నొప్పి వంటి శ్వాసకోస వ్యాధులను పైనాపిల్ తగ్గిస్తుంది.
అనాస పండులో ఉండే విటమిన్ సి అన్ని రకాల నోటి సమస్యలను నివారిస్తుంది. పంటి వ్యాధుల్లో వచ్చే వాపులు, చిగుళ్ల సమస్యలను నివారించడంతో పాటు చిగుళ్ళ నుండి రక్తం కారే సమస్యలను తగ్గిస్తుంది.తాజా అనాస పండ్ల రసాన్ని గొంతులో పోసుకునే పుక్కలించడం ద్వారా గొంతు నొప్పి మరియు టాన్సిల్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.అంతేకాకుండా... తాజా పైనాపిల్ రసాన్ని తీసుకోవడం వలన చర్మం నివారింపును సంతరించుకుంటుంది. కడుపులో ఏర్పడే పైత్యపు వికారాలను తగ్గిస్తుంది.కడుపునొప్పి,ఉబ్బరంగా ఉండే ఉదర సమస్యలను తగ్గిస్తుంది. ఆహారంతో పాటు పొరపాటుగా కడుపులోకి ప్రవేశించిన కేశాలను బయటకు పంపిస్తుంది.