దానిమ్మ పండుతో బోలెడు లాభాలు..!!
దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోయి మన శరీరం కాంతివంతంగా, నిగనిగలాడుతూ ఉంటుంది.
దానిమ్మ పండులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానిమ్మ పండు తినడం వలన మన జీర్ణ ప్రక్రియ చాలా బాగా మెరుగుపడుతుంది. అలానే మనం తీసుకున్న ఆహారం చాలా త్వరగా డైజెషన్ అయ్యేలా చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపుతుంది. దానిమ్మ పండు బరువు తగ్గడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దానిమ్మ పండులో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించే గుణాలు ఉన్నాయి.
దానిమ్మతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని అడ్డుపడకుండా దానిమ్మ పండు లోని పోషకాలు నివారిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది. దానిమ్మ రసం తాగడం వలన రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది.
దానిమ్మ పండుకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడ్డాన్ని నివారించే శక్తి ఉంది. ముత్ర పిండాల్లో రాళ్లకు కారణమయ్యే ఆక్సలైడ్లు,క్యాల్షియం,ఫాస్పెట్ సాంద్రతను తగ్గించి రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి రోజుకు ఒకసారైనా దానిమ్మ రసం తాగడం మంచిది.