
ఏ రకం అరటిపండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
బాగా పండిన అరటి పండులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు,పైబర్ కంటెంట్ వుంటాయి.మలబద్దకానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.జీర్ణాశయం పనితీరును మెరుగుపరుస్తుంది.
క్యాన్సర్ నివారించడం..
పచ్చి అరటిపండులో వుండే యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు కేన్సర్ కారకాలైన ప్రీ రేడికల్స్ నీ తొలగించి, క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
పచ్చి అరటి పండులో ఎక్కువ మొత్తంలో విటమిన్లు, మినరల్స్ వుంటాయి.ఇవి శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను పుష్కళంగా అందిస్తుంది.
మగ్గిపోయి, మెత్తగా తయారైనా అరటి పండులో ఎక్కువ మొత్తంలో చక్కెరలు, తక్కువ మొత్తంలో పీచు పదార్థాలు వుంటాయి.ఈ పండ్లను డయాబెటిస్ కలవారు అసలు ముట్టుకోకూడదు. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ని పెంచుతుంది.
మచ్చలు కలిగిన అరటి పండ్లు:
మార్కెట్లో మనకు నా మచ్చలు కలిగిన అరటి పండ్లు దొరుకుతూ ఉంటాయి.అవి రుచికి చాలా తియ్యగా ఉంటాయి. అరటిపండుపై ఎంత ఎక్కువగా నల్లటి మచ్చలు వుంటే అంత అధిక మొత్తంలో చక్కెరలు ఉన్నట్లు ఆహార నిపుణులు చెబుతుంటారు.
నిద్రలేమి నియంత్రించడానికి:
కొంతమంది రాత్రిపూట ఎంతకీ నిద్ర పట్టక,నిద్ర లేమితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రి పూట భోజనం చేసిన తర్వాత, రోజూ బాగా పండిన అరటిపండు తింటే మంచి నిద్ర పడుతుంది. పండు తిన్న గంటలోపే నిద్రలోకి జారుకోవచ్చు.నిద్రకు వెళ్లే గంటముందు టీవీ, మొబైల్ వాడకుంటే నిద్రబాగా పడుతుంది.