కోపం ఎంత ప్రమాదమో తెలుసా..?

Divya
ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడిల కారణం చేత ప్రతి ఒక్కరు కూడా చిన్న విషయానికి కూడా విపరీతంగా కోపడుతూ ఉంటారు.ఇలా తరచూ కోపంతో ఇబ్బంది పడేవారు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటివారు ఆహారములో ఉప్పు,మసాలాల వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక కోపం తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి లేదంటే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అందుకు సంబంధించి పూర్తి వివరలను తెలుసుకుందాం.

కోపం వల్ల ఎక్కువగా జీవశక్తి తగ్గిపోతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. అంతేకాకుండా హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. కోపం వల్ల పునరుత్పత్తి శక్తి కూడా చాలా తగ్గిపోతుంది. దీనివల్ల అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు, తలనొప్పి వంటివి ఎక్కువగా ఏర్పడతాయి. ఒక్కోసారి ఈ కోపం వల్ల పక్షవాతం బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నదట. విపరీతంగా కోపం రావడం వల్ల మనకు ఇష్టమైన సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెప్పవచ్చు. ఉద్యోగాలు వ్యాపారం చేసేవారు ఇలాంటి కోపం వల్ల ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది.
కోపం మానసిక సంఘర్షణకు ముఖ్య కారణమని చెప్పవచ్చు. కోపం వల్ల కేవలం  బాధను మాత్రమే మిగులుతుంది. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని పెద్దలు ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటారు. కోపంలో పలుసార్లు చేయకూడని పనులు చేస్తూ ఉంటాము. కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించడం వల్ల నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే కోపాన్ని ఎక్కువగా కంట్రోల్ చేసుకోవాలని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా కోపం ఎక్కువగా రావడం వల్ల రక్తప్రజర్ ఎక్కువగా అయి నరాలు చిట్లే అవకాశం ఉంటుంది. కోపాటి తగ్గించుకోవడం కోసం అవసరమైన వ్యాయామం పలు చిట్కాలను పాటిస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: