జీర్ణక్రియను పెంపొందించే ఆహార పదార్థాలు ఇవే..!
చాలాసార్లు శరీరంలో బద్ధకం, అలసట, శక్తి లేకపోవడం, నీరసంగా అనిపించడం ఇలా కొన్ని అనిపిస్తూ ఉంటాయి . దీని వల్ల ఏ పని కూడా జరగదు. శరీరం సహకరించదు. బలహీనత ,అలసట , ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. శరీరానికి శక్తి అందకపోవడంతోనే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం జీవక్రియ బాగా ఉంటే మీరు రోజంతా చురుకుగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎనర్జిటిక్ గా వుంటాం. మీరు రోజంతా చురుకుగా ఉంటారు.. అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఎలాంటి ఆహారం తీసుకుంటే చురుకుగా ఉంటామో వాటి గురించి ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
జీవక్రియను పెంచడానికి ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అందులో ముఖ్యంగా అల్లం.. శరీరానికి కావలసిన యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను అందిస్తుంది. వీటివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శరీరం నొప్పులను విసర్జిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి మెటబాలిజం పెరుగుతుంది.
ఆకుపచ్చని కూరగాయలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.. వీటిని తినడం వల్ల శరీరం స్ట్రాంగ్ గా మారి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. తినే ఆహారంలో పచ్చి కూరగాయలను చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బి వంటి పోషకాలు ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
కాఫీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇక కాఫీ తాగడం వల్ల శరీరంలోని నీరసం, అలసట తొలగిపోతాయి. అంతేకాదు కాఫీ తాగడం వల్ల శరీరంలోని జీవక్రియలు బలపడతాయి.
కొబ్బరి నూనె కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో తయారు చేసిన వంటలు తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనెలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. కాబట్టి శరీరాన్ని స్లిమ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జీర్ణక్రియ రేటును పెంపొందించుకోవచ్చు.