"రక్తదానం" చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ?

VAMSI
మామూలుగా అనాదిగా వస్తున్న పెద్దలు చెబుతూ వస్తున్న మంచి మాటలలో అన్ని దానాలలో కన్నా ఉత్తమమైన దానం అన్నదానం అని... అయితే దీనికి మించిన దానం ఇంకొకటి ఉంది, అదే రక్తదానం. ఒక రోజులో దేశ వ్యాప్తంగా లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలలో ఏ గాయం తగిలినా రక్తం పోవడం సహజం. అటువంటి సమయంలో హాస్పిటల్ కు వెళ్ళిన సదరు వ్యక్తికి అర్జెంట్ గా రక్తం అందిస్తేనే కాపాడడం వీలవుతుంది. ఒకవేళ ఆ సమయానికి రక్తం అందుబాటులో లేకపోతే ఆ మనిషి మరణిస్తాడు. అందుకే మన దేశంలో ఉన్న హాస్పిటల్స్ కావొచ్చు, బ్లడ్ సెంటర్స్ కావొచ్చు వీలైనంత రక్తాన్ని సేకరించి అవసరం అయిన వారికి సరఫరా చేస్తుంటాయి.

అయితే అలా మనకు సరిపడా రక్తం ఉండాలి అంటే.. రక్తదానం చేసే వారి సంఖ్య పెరగాలి. అందుకే ట్రస్ట్ లు ద్వారా ఎంతోమంది రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అయితే రక్తదానం చేసే ముందు వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

* ముందుగా ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్య వంతుడు అయి ఉండాలి.

* మీకు ఎటువంటి దీర్ఘ కాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటూ ఉంటే అలాంటి వారు అర్హులు కారు.

* రక్తం ఇచ్చే ముందు రోజు రాత్రి నిద్రలేమితో ఉండకూడదు.

* రక్తం ఇచ్చే రోజు ఆల్కహాల్ తీసుకోకూడదు.

* రక్తం ఇచ్చే ముందు ఎటువంటి జ్యూస్ కానీ ఇతర పానీయాలను కానీ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా ఖచ్చితంగా 20 నిముషాల గ్యాప్ తర్వాతనే రక్తం ఇవ్వవలెను.

పై విషయాలు అన్నీ చూసుకున్న తర్వాతనే రక్తదానం చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే రక్తం ఆరోగ్యకరంగా ఉంటేనే తీసుకునే వ్యక్తికి ఆరోగ్యం అన్న విషయం మరిచిపోకండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: