మలబద్ధకం సమస్యని తగ్గించే ఆసనాలు!

Purushottham Vinay
ఇక మలబద్ధకం అనేది సాధారణ సమస్య. మన ప్రేగు కదలికలు కష్టంగా మారిన సందర్భాన్నే మలబద్ధకంగా చెప్పవచ్చు. తీసుకున్న ఆహారం ఇంకా జీవనశైలి క్రమం తప్పి ఆహారం తీసుకోవటం ఇలాంటివన్నీ మలబద్ధకం తలెత్తడానికి కారణమౌతాయి.నీరు ఎక్కువగా తీసుకోకపోవటం, బలహీనమైన కండరాలు ఇంకా ఆహారంలో ఫైబర్ తీసుకోకపోవటం వంటివి సైతం మలబద్దకానికి కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ మలబద్ధకాన్ని నివారించేందుకు రోజు వారిగా కొన్ని యోగాసనాలు ఎంతగానో తోడ్పడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాలాసనం: ఇది మోకాళ్ల మీద కూర్చుని, ముందుకు వంగాలి. ఇంకా పొత్తికడుపు తొడలకు తగిలేలా, తల నేల మీద ఆనేలా ముందుకు వంగాలి. అలాగే రెండు చేతులను తల మీదుగా చాపి, నేలను తాకించాలి. ఇక ఈ భంగిమలో ఐదు సార్లు శ్వాస తీసుకునేంత సమయం ఉండి యథాస్థితికి రావాలి. ఇలా చేయటం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.


మాలాసనం: దీనికి కాళ్ల మధ్య ఎడం ఉండేలా నిలబడాలి. మోకాళ్లు వంచి ఇంకా నేల మీద స్క్వాట్‌ పొజిషన్‌లో కూర్చోవాలి. అలాగే చేతులు రెండు జోడించి, మోచేతులు మోకాళ్లకు ఆనేలా శరీరం దగ్గరకు చేతులను తీసుకురావాలి. వెన్ను, మెడ నిటారుగా ఉంచి, ఇంకా భుజాలను రిలాక్స్‌డ్‌గా ఉంచాలి. ఇక ఈ భంగిమలో ఐదు సార్లు శ్వాస తీసుకునేంత సమయం ఉండి యథాస్థితికి రావాలి. ఇలా చేయటం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.


పవనముక్తాసనం: ఇందులో విశ్రాంత స్థితిలో వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను మడిచి ఇంకా పొత్తికడుపు దగ్గరకు తీసుకురావాలి. రెండు చేతులతో మోకాళ్లను బిగించి, తరువాత దగ్గరకు లాక్కోవాలి. తలను పైకెత్తి, ఇంకా గడ్డం ఛాతీకి ఆనించాలి. ఈ భంగిమలో 5 సెకన్లు పాటు ఉండి, తిరిగి యథాస్థితిలోకి రావాలి. ఇలా చేయటం వల్ల విరోచనం చాలా సాఫీ అవుతుంది. మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: