ఇవి తింటే అసలు ఏ రోగాలు రావు?

Purushottham Vinay
ఇక సాధారణంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే కొన్ని రకాల ఆహార పదార్థాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్యులు ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారు. ఇక అలాంటి వాటిలో ఖచ్చితంగా కొబ్బరి ఇంకా అలాగే బెల్లం కూడా ఒకటి.పోషకాలు బాగా మెండుగా లభించే కొబ్బరి ఇంకా బెల్లము ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో పోషకాలు లభించడంతోపాటు మరెన్నో ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం , యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం ఇంకా ఇనుము సమృద్ధిగా మన శరీరానికి లభిస్తాయి.ముఖ్యంగా బెల్లంతో పోలిస్తే కొబ్బరిలో ఎక్కువ పోషకాలు అనేవి ఉంటాయి.ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే దగ్గు , జలుబు ,గొంతు నొప్పి ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇంకా జ్వరం ఇలా అన్ని సమస్యల్ని కూడా తగ్గించడానికి కొబ్బరి ఇంకా బెల్లం చాలా చక్కగా సహాయపడతాయి. ఇక అంతేకాదు జీర్ణ ఎంజైమ్స్ సక్రమంగా విడుదల అయ్యేలాగా కూడా చేస్తాయి.


ఇక తిన్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి, గ్యాస్, కడుపుబ్బరం, అజీర్తి ఇంకా మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేయడానికి కొబ్బరి ఇంకా బెల్లం చాలా చక్కగా సహాయపడతాయి. ఇక అంతేకాకుండా వీటిలో ఉండే పొటాషియం కారణంగా శరీరంలో అదనంగా ఉన్న నీటిని కూడా బయటకు పంపుతుంది. దాంతో శరీర బరువు నియంత్రణలోకి వచ్చి బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు.ఇంకా తరచూ బాధించే మైగ్రేన్ తలనొప్పిని కూడా మీరు చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు. కొబ్బరి బెల్లం తినడం వల్ల మైగ్రేన్ సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇక అలాగే నీరసం, నిస్సత్తువ ఇంకా అలసట ఉన్నప్పుడు కూడా వీటిని తింటే వెంటనే శక్తి లభిస్తుంది. ఇక కాల్షియం సమృద్ధిగా లభించి కీళ్ల నొప్పులు ఇంకా కాళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇకపోతే 40 సంవత్సరాలు వచ్చిన వారు ఎక్కువగా బెల్లం ఇంకా కొబ్బరి కలిపి తినడం వల్ల మరిన్ని పోషకాలు చాలా ఈజీగా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: