మొక్కజొన్న పీచు ఆరోగ్యానికి ఇంత మంచిదా?

Purushottham Vinay
మొక్కజొన్న పీచులో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి, సి ఇంకా అలాగే కే వంటి విలువైన పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న పీచుతో టీ తయారు చేసుకొని తాగితే ప్లేవనాయిడ్స్, విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి బాగా అందుతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బాడీ లో అవయవాలు పనితీరును కూడా బాగా మెరుగుపరుస్తుంది. మొక్కజొన్న లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యూరిన్ ఇన్ఫెక్షన్ ను కూడా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే యూరిన్ లో ఉండే బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. ఇంకా అలాగే మన శరీరంలో ఉన్న అదనపు నీరును, వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది. ఇంకా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఈ మొక్క జొన్న పీచు సహాయపడుతుంది. అలాగే మొక్కజొన్న పీచు బ్లడ్ లోని కొలెస్ట్రాల్ను కూడా చాలా ఈజీగా నియంత్రణలో ఉంచుతుంది. ఇంకా అలాగే రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని త్రాగడం వలన రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇంకా మనకు ఏదైనా గాయం తగిలితే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేది విటమిన్ కె.


ఈ విటమిన్ కె కూడా ఈ మొక్కజొన్న పీచులో అధికంగా ఉంటుంది.ఇంకా అలాగే అధిక బరువు ఉన్నవారు మొక్కజొన్న పీచుతో తయారుచేసిన టీ ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం దక్కుతుంది. అయితే మొక్కజొన్న పీచు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గాలి దూరని డబ్బాలో వేసి చాలా గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. అయితే ఇప్పుడు మొక్కజొన్న పీచుతో టీ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని కొన్ని మొక్కజొన్న పీచులను వేసి బాగా మరిగించుకోవాలి.ఇక ఆ తరువాత మరొక గిన్నెలోకి ఇలా మరిగించిన నీళ్లను వడకట్టుకోవాలి. ఆ తరువాత ఈ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి త్రాగాలి. ఇంకా అలాగే ఈ మిశ్రమం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక దానిని వారం రోజుల దాకా వాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: