ఈ స్మూతి తాగితే ఏ జబ్బు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు!

Purushottham Vinay
బనానా ఇంకా స్ట్రాబెర్రీ ..ఈ రెండు కూడా చాలా మంచి డైట్ ఫుడ్..వీటి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఈ రెండు పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, మాంగనీస్, ప్రోటీన్‌ ఇంకా అలాగే ఫైబర్ తో సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి.అయితే స్ట్రాబెర్రీ ఇంకా బనానాలను విడి విడిగా కాకుండా కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరిన్ని వండల్ ఫుల్ హెల్త్ బెన్‌ఫిట్స్‌ను ఈజీగా తమ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు చాలా మంచి బెనిఫిట్స్‌ ఉన్నాయని అంటున్నారు.ఇక వీటిని కలిపి ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


ముందుగా ఒక అరటి పండు ఇంకా ఒక స్ట్రాబెర్రీ పండు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు ఇంకా అరటి పండు ముక్కలు ఇంకా ఒకటిన్నర గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్‌, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు ఇంకా అలాగే రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అర స్పూన్ అవిసె గింజల పొడి, వన్ టేబుల్ స్పూన్ బాదం పలుకులు ఇంకా సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ అలాగే బనానా ముక్కలను వేసి కలిపితే స్మూతీ అవుతుంది.


ఈ హెల్తీ స్మూతీని వారంలో మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటే, మెమరీ పవర్ పెరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.ఒత్తిడి ఇంకా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంకా అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. పొట్టలో అల్సర్ నుంచి కూడా విముక్తి లభిస్తుంది. నీరసం ఇంకా అలసట వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే జీర్ణ వ్యవస్థ పని తీరు సైతం చాలా బాగా మెరుగుపడుతుంది..గర్భంతో ఉన్న మహిళలకు ఇది చాలా మంచిది.బిడ్డ ఎదుగుదలకు కావలసిన అన్నీ కూడా ఇందులో ఉన్నాయి.స్ట్రాబెర్రీ ల వల్ల రక్తం బాగా వృద్ధి చెందుతుంది.. స్మూతీ లా కాకున్నా కాయలాగా తీసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: