బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటూ బ్లాక్ కాఫీ తాగుతున్నారా?

VAMSI
అధిక బరువుతో బాధపడే వారు తమ బరువును తగ్గించుకోవడానికి ఎంచుకునే మార్గాలు ఎన్నో.... కొందరు మెడికల్ గా మరి కొందరు వంటింటి చిట్కాలు, డైటింగ్ లు ఇలా చాలానే చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది డైటింగ్ పేరుతో ఎక్కువగా ఉపవాసం ఉంటుంటారు. అయితే అలా ఉపవాసం ఉన్నప్పుడు ఆకలిని కంట్రోల్ చేసుకోవడానికి కాఫీలు, టీ లు తాగుతుంటారు. ఎక్కువ మంది కాఫీలు తాగడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అంతేకాదు ఫాస్టింగ్‌ సమయాల్లో బ్లాక్‌ కాఫీ శరీరానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్న మాట. ఇది శరీరం లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అని అంటున్నారు.
కొందరు బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉపవాసం ఉంటుండగా ఆకలిని తగ్గించుకోవడానికి బ్లాక్ కాఫీలు  తాగుతుంటారు. కాఫీలు తాగడం వలన తక్షణ శక్తి లభిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియలో ఒక వ్యక్తి 8 గంటలు లేదా 16 గంటల పాటు ఫాస్టింగ్‌ ఉంటున్నట్లు అయితే ఆహారం తీసుకునే విషయం లో నిర్దిష్ట వేళలను పాటించాలి. వెయిట్‌ లాస్‌ డైట్‌ కారణంగా బరువు సులువుగా తగ్గుతారు అన డానికి వాస్తవం ఉంది. ఫాస్టింగ్‌ అనేది మెరుగైన జీర్ణక్రియ, జీవక్రియ, కణాల పని తీరు వంటి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. అయితే ఈ క్రమం లో ఎక్కువ మంది కాఫీలు తాగుతుంటారు.
అయితే కాఫీ ని పరిమితికి మించి తాగితే ప్రమాదం అని చెబుతున్నారు. కాఫీలో ఎక్కువగా ఉండే కెఫిన్ పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు ఉండే వారు కాఫీ కి దూరంగా ఉండటం మంచిదట. కాఫీ ఎక్కువగా తాగటం వలన ఆలోచన లో మార్పులు వచ్చి ఆందోళన పెరుగుతుందట. అంతే కాకుండా జీర్ణ ప్రక్రియ లో మార్పులు చోటు చేసుకుని ఇబ్బందికరంగా  మారుతాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: