నడుము నొప్పి అధికమవుతోందా.. అయితే ఈ చిట్కా తప్పనిసరి..!!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది ఆడవారి తో పాటు మగవారు కూడా వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలు ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల భారం వెన్నెముక మీద పడి నొప్పి తీవ్రతరం అవుతోంది. ఇకపోతే నడుంనొప్పి కొద్దిమందిలో మాత్రమే తరచుగా వస్తూ ఉంటుంది. కొన్ని లక్షణాలను బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కూడా మనం కొంతవరకు నిర్ధారించవచ్చు. నడుం నొప్పిని కొన్ని ఇంటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది అని గుర్తించాలి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్రపిండాలలో రాళ్లు వరకు నడుము నొప్పికి కారణాలు కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పి అనేది చాలా సర్వసాధారణం కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో నడుమునొప్పి ఉన్నప్పటికీ వెన్నుపాము తో సంబంధం ఉండదు.

ఈ సమస్యను దూరం చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఆహారాన్ని లిమిట్ గా తీసుకోవాలి. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతాయి.  ఇక ప్రతి రోజూ వ్యాయామం,  యోగా వంటివి చేస్తూ ఉండాలి . అదే విధంగా ఒకే చోట కూర్చోవడం, నిల్చోవడం లాంటివి చేయకూడదు. సరైన నిద్ర కూడా వెన్నునొప్పిని దూరం చేస్తుంది. ముఖ్యంగా మీరు గడిపే బిజీ లైఫ్ స్టైల్ లో ప్రతిరోజు గంటసేపు డాన్స్ లేదా వాకింగ్ చేయడానికి కేటాయించాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి చిట్కాలను పాటిస్తే నడుము, మెడ నొప్పి కూడా దూరం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: