ఆపిల్ తొక్క ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Purushottham Vinay
ఇక ప్రతి రోజూ కూడా ఒక ఆపిల్ పండు తింటే ఖచ్చితంగా వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదంటారు. ఆపిల్ లో ఆరోగ్యం పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఇక ఆపిల్ తినే విధానంపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఆ కారణంగా ఆపిల్‌ను ఎలా తినాలో తెలియక చాలా మంది కూడా కన్‌ఫ్యూజన్‌తోనే తినేస్తుంటారు. ఇక ముఖ్యంగా ఈ ఆపిల్‌ను తొక్క తీసి తినాలా? లేక అలాగే తినాలా? తొక్క తీసి తింటే రుచి పోతుందని కొందరు.. తొక్క అలాగే ఉంచి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని ఇంకొందరు తమలో తామే ఇక ఒక నిర్ణయానికి వస్తారు. అయితే, ఆపిల్‌ పండును ఎలా తిన్నా కూడా ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అలాగే ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ గుజ్జుల్లో ఫైబర్, విటమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్లు ఇంకా అలాగే పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో ఆపిల్ తొక్కలోనూ ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయని కూడా చెబుతున్నారు. ఇక ఆపిల్ తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఇక ఆపిల్ తొక్కలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుండి ఊపిరితిత్తులను బాగా రక్షిస్తుంది.

ఇక యాపిల్ స్కిన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర ఇంకా అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. ఇవి ఆరోగ్యకరమైన గుండె కోసం వాస్కులర్ ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతాయి.ఈ ఆపిల్ తొక్కలో పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇది అతిగా తినకుండా నిరోధించడానికి చాలా బాగా తోడ్పడుతుంది. ఇక సరైన స్థాయిలో వ్యాయామం చేస్తూ.. రోజుకు సరిపడగా కేలరీల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి ఈజీగా సహాయపడుతుంది. అదే పాలీఫెనాల్స్ బరువు తగ్గడానికి కొవ్వు ఇంకా గ్లూకోజ్ శోషణను నిరోధిస్తాయి.ఇక ఆపిల్‌ స్కిన్‌లో బరువు తగ్గించే లక్షణాలతో పాటు.. కాలేయ పనితీరుని కూడా బాగా మెరుగుపరుస్తుంది.అలాగే ఎముకల ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ రోగులు, మలబద్ధకం, గ్యాస్ ఇంకా కడుపు ఉబ్బరంతో సతమతం అవుతున్న వారికి ఈ ఆపిల్ స్కిన్ అనేది అద్భుత ఔషధం లాగా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: