ఖాళీ కడుపుతో అరటి పండు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!!

Divya
అరటిపండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఆకలేసినప్పుడు కేవలం ఒక అరటిపండు తింటే చాలు కడుపు నిండిపోతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇందులో ఐరన్ తో పాటు ఇతర పోషకాలు కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా పెంపొందిస్తాయి.. అయితే ముఖ్యంగా ఖాళీకడుపుతో అరటి పండ్లు తినడం వల్ల ఇందులో ఉండే ఐరన్ శరీరాన్ని గ్రహించి రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది. దీని వల్ల రక్తహీనత సమస్య నుండి ఉపశమనం పొందుతారు. ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1).అరటిపండు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అరటిపండులో ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల.. అరటి పండు తిన్న తర్వాత కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. అందుచేతనే వీటిని తిన్న తర్వాత తక్కువగా ఫుడ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.

2). అరటి పండులో పక్షవాతాన్ని దూరం చేసే శక్తి కలదు.. అన్ని ఎనర్జీ డ్రింక్ కంటే ఈ అరటి పండ్లు చాలా శక్తివంతమైనదని చెప్పవచ్చు.
3).చర్మకాంతి మెరవాలి అనుకునేవారు అరటి పండ్లను తరచూ తినడం వల్ల చర్మం మీద ముడతలు పడకుండా ఉంటాయి.
4). అరటి పండు గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఎటువంటి పోషకాలు చాలానే ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్, మెగ్నీషియం, వంటివి ఉండటం వల్ల గుండె పదిలంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే ఖాళీ కడుపుతో అరటిపండు తినొచ్చా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.. అయితే మన శరీరం ప్రతిరోజు పని చేయడం వల్ల మన ఆహారంలో పలు పోషకాలు అవసరం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా ఆకలి సమస్యలను దూరం చేస్తుంది. అయితే వైద్యులు సూచించిన మేరకు ఖాళీ కడుపుతో ఉదయాన్నే అరటి పండ్లు తినకూడదు అని తెలియజేస్తున్నారు. ఎందుచేత అంటే ఇందులో చక్కెర కంటే ఎక్కువగా ఉంటుంది అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: