మామిడి గింజల వల్ల ఉపయోగాలు తెలిస్తే షాక్..!!

Divya
ఈ వేసవికాలంలో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ మార్కెట్ కి వెళ్ళిన మామిడి పండు భవాని ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే ఈ ఎండాకాలంలో మామిడి పళ్ళ కు ఉన్న క్రేజ్ అలాంటిది. మామిడికాయ తినడానికి విపరీతంగా ఆసక్తి చూపే జనాలు కూడా ఉన్నారు. అయితే మామిడికాయను పండు నంత తినేసి మామిడి కాయలోని చిప్పను పడేస్తూ ఉంటారు. అయితే మామిడి కాయలు ఉండే ప్రయోజనాల కంటే మామిడి చిప్ప లోని అనేక ప్రయోజనాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.


మామిడికాయలు అనేకరకాల విటమిన్లతోపాటు, పోషకాలు, ఖనిజాలు కూడా చాలా ఉన్నాయట. అయితే ఈ సీజన్లో దొరికే మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారని ఉద్దేశంతో ఎక్కువ మంది వీటిని తినడానికి ఇష్టపడరు. ఇక అంతే కాకుండా మధుమేహం ఉన్నవారు కూడా వీటికి చాలా దూరంగా ఉంటారు. అయితే ఈ ఆలోచన చాలా తప్పు అని కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆరోగ్య నిపుణులు తెలిపిన ప్రకారం మధుమేహ బాధితుల సైతం మామిడి పండ్లను తినవచ్చని తెలియజేస్తున్నారు. తాజాగా మామిడి పళ్ళ పై కొంతమంది పరిశోధనలు చేయడంతో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి వాటి గురించి చూద్దాం.



ముఖ్యంగా మామిడి పళ్ళు, మామిడి చిప్పపై  షాకింగ్ విషయాలను తెలియజేశారు. మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉన్నట్లయితే.. మామిడి గింజలు తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం చాలా తగ్గుతుందట. వీటిని తిన్న వ్యక్తి శరీరంలో కొలెస్ట్రాల్ చాలా అదుపులో ఉంటుందట. దీంతో పాటు అనేక సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. మామిడిలో ఖనిజాలు, విటమిన్లు ఉన్నట్లు అయితే.. మామిడి గింజల లో కూడా అంతకుమించి పోషకాలు ఉన్నట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా విటమిన్ లలో A,C,E , మెగ్నీషియం, కాఫర్, పొటాషియం వంటి పోషకాలు కూడా . మామిడికాయ కంటే మామిడికాయ గింజలలోని బహుళ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని అధ్యయనంలో తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: