ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త సుమీ?
అయితే ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీటిని అందరూ తాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. బయటికి వెళ్తే దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న నీటిని కొనుక్కుంటారు. ఇక ఇంట్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు నిల్వ ఉంచి తాగుతూ ఉంటారు. అయితే ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు నిల్వ ఉంచి తాగడం ఏమాత్రం మంచిది కాదు అని అటు నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ జనాలు మాత్రం పట్టించుకోకుండా ఇలాగే చేయడం చేస్తూ ఉంటారు. ఇంతకీ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగితే ఏం జరుగుతుంది.. ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నీళ్లు ఉన్న ప్లాస్టిక్ బాటిల్ లను ఎక్కువకాలం ఎండలో ఉంచితే దయాక్సిన్ అనే విష వాయువు వెలువడి ఇక నీళ్లలో కలిసి పోతుందట. ఇక ఇలాంటి నీళ్లను తాగితే రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ఎక్కువ కాలం ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ ఉన్న నీరు తాగడం కూడా ఎంతో ప్రమాదకరం అంటూ చెబుతున్నారు. ఇలా ఎక్కువ కాలం ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ ఉంచిన నీరు తాగితే బైఫినైనల్ అనే విషయం రసాయన శరీరంలోకి చేరి మధుమేహం ఊబకాయం సంతానోత్పత్తి సమస్యలు కాలేయ సమస్యలు పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించటం లాంటివాటికి కారణమవుతోందని అంటున్నారు.