వేసవి కాలం: ఇలా చెయ్యకపోతే "యమ డేంజర్"... ?
ఇపుడు వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలను గురించి తెలుసుకుందాం.
* నీటిని పుష్కలంగా తాగాలి. రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల వరకు నీరు త్రాగాలి.
* శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిడ్జ్ లో ఉంచిన నీటిని అందు లోనూ ఓవర్ కూల్ గా ఉండే నీటిని తాగకండి.
* సాధారణ గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని లేదా కుండలో ఉన్న నీటిని తాగడం శ్రేయస్కరం.
* బయట పనుల మీద వెళ్ళే వారు తమతో ఒక వాటర్ బాటిల్ ను తీసుకు వెళ్ళండి.
* వేసవి కాలంలో ఎక్కువగా పండ్లను తినటం మంచిది. అలాగే మసాలా వంటలను తినడం తగ్గించాలి.
* స్నానానికి చల్లటి లేదా గోరు వెచ్చటి నీటిని మాత్రమే వినియోగించాలి. వేసవి కాలంలో వేడి నీటితో స్నానం చేయరాదు.
* వేసవి కాలంలో మరి నీరసం వచ్చి అలసి పోయేలా వ్యాయామం చేయరాదు.