పచ్చ కామెర్లు తగ్గాలంటే..?

Divya
పచ్చకామెర్లు అనేవి అందరికీ రావడం సహజం . కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పచ్చకామెర్లను మనం దూరం చేసుకోవచ్చు. పచ్చకామెర్లు అనేది నవజాత శిశువులలో ఎక్కువగా కనిపిస్తాయి. కాలేయం వాపు .. పిత్తాన్ని అడ్డుకోవడం వంటి సమస్యలు ఏర్పడినప్పుడు పచ్చకామెర్లు వస్తాయి. ఆహారాన్ని లేదా పానీయాలను ప్రాసెస్ చేయడానికి కాలేయం చాలా బాగా పనిచేస్తుంది. ఇక శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను.. టాక్సిన్లను తొలగించడంలో కాలేయ పనితీరు బాగా పని చేయడం గమనార్హం. ఇక ఒక్కసారి మనం తీసుకునే కలుషిత ఆహారం , కలుషిత నీటి వల్ల కాలేయం పనితీరు దెబ్బతింటుంది.

రక్తంలో బిలిరుబిన్ అనే వ్యర్థాలు పేరుకుపోవడానికి దారి తీయడంతో పాటు కామెర్లు కూడా వస్తాయి. కామెర్లు వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే
 జ్వరం, అలసట , చర్మం లేదా కళ్ళు, గోళ్ళు పసుపు రంగులోకి మారవచ్చు. శరీరం చాలా బలహీనంగా మారడం తో పాటు ఇతర వ్యాధులకు దారితీస్తుంది.ఈ సమయంలో, రోగికి పూర్తి వరకు బెడ్ రెస్ట్ అనేది చాలా అవసరం. పచ్చ కామెర్లు వచ్చాయని తెలిసిన మొదటి ఇ రోజులు లిక్విడ్ డైట్ పాటించాలి. సాధారణంగా వ్యాధి యొక్క లక్షణాలను బట్టి మందులు కూడా సూచించబడతాయి.. కానీ కాలేయం యొక్క మెరుగుపడాలంటే మీరు కఠినమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఇక కామెర్లు త్వరగా పోవడానికి మీరు తినవలసిన కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సూప్ :  
సాధారణంగా మనకు ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు ఘనమైన పదార్థాలను తినడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా పానీయాలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి అలాంటి వారు సూప్ తయారు చేసుకుని తాగితే  మంచిది. సూప్ తాగడం వల్ల పోషకాలు లభించి , రోగి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతాయి.

వీటితోపాటు ప్రోటీనులు కలిగిన ఆహారం,  పండ్లు, కూరగాయల రసాలు, నీరు ఎక్కువగా తాగడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే.. పచ్చకామెర్లు నుంచి బయటపడవచ్చు. మీరు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: