జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ?
మామూలుగా మనము తీసుకునే ఆహరం కూడా మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనము తీసుకునే ఆహరంలో ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. వీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత నెలకు రెండు సార్లు మాంసం తీసుకోవచ్చు. ఇక పూర్తిగా ఔట్ సైడ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఇక అది కాకుండా మనము మన శరీరాన్ని ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటే వ్యాయామం చేయడం పరిపాటి. కానీ ఈ వయసులో పడితే అప్పుడు ఈ వ్యాయామం చేయడం మంచిది కాదని ప్రముఖులు చెబుతున్న మాట.
యువకులు ఒక రోజులో కనీసం ఒక గంట సేపు అయినా వ్యాయామం చేయడం మంచిదని డాక్టర్స్ సూచిస్తున్నారు. అయితే వ్యాయామం అంటే జిమ్ కు వెళ్లే పనిలేదు. కేవలం సైకిల్ తొక్కడం, డ్యాన్స్ చేయడం, రన్నింగ్, ఏరోబిక్ లాంటి మీకు మీరే చేసుకునే వ్యాయామాలు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే చిన్న పాటి బరువులు ఎత్తడం మరియు పుష్ అప్ లు తీయడం వంటివి చేయడం వలన మీరు జీవిత కాలం ఆరోగ్యంగా ఉంటారు అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. మరి మీరు కూడా జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ రోజు నుండే పై విధంగా చేయడం స్టార్ట్ చేయండి.