ఎన్నో రకాల పోషకాలు ఉన్న బాదం.. శరీరానికి ఎంతో బలాన్నిస్తుంది. ఈ బాదం పప్పులను దాదాపు అన్ని ఇళ్లలో డ్రై ఫ్రూట్స్‌గా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే పీచు, ప్రొటీన్లు, విటమిన్లు ఇంకా అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహకరిస్తాయి.బాదం పప్పు శరీరానికి మేలు చేసినప్పటికీ ఎండిన బాదంపప్పులను వేసవి కాలంలో ఎక్కువగా తినడం వల్ల శరీరానికి మేలు చేసే బదులు చాలా హాని కలిగిస్తాయి. బాదం పప్పు శరీరానికి వేడి చేయడం వల్ల పిత్త దోష సమస్య అనేది వస్తుంది.ఇక శరీరంలో వేడి బాగా పెరగడం వల్ల కురుపులు ఇంకా అలాగే మొటిమలు వచ్చే ప్రమాదం చాలానే ఉంది. ఐతే వేసవిలో కొన్ని గంటలపాటు నీళ్లలో నానబెట్టిన ఈ బాదంపప్పులను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండు మామూలు బాదం కన్నా.. ఇలా తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.వేసవిలో జీర్ణ సమస్యలు బాగా పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఎండిన బాదం తినడం చాలా హానికరం.
నానబెట్టిన బాదం తింటే అది చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఇంకా పిత్త దోషం ఉండదు. అందువల్ల శరీరంలో వేడి అసలు పెరగదు.నానబెట్టిన బాదంపప్పు పొట్టుని తీసిన తర్వాత తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది. బాదం పొట్టులో టోనిన్ అనేది ఉంటుంది. ఇది శరీరం పోషకాలను గ్రహించకుండా వాటిని నిరోధిస్తుంది. అలాంటప్పుడు పొట్టు తీసిన బాదం పప్పులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక ఈ బాదం పప్పులో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే గుణం కూడా ఉంటుంది.బాదం పప్పులో విటమిన్ ఇ అనేది పుష్కలంగా ఉంటుంది. జుట్టు ఇంకా చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చనిపోయిన చర్మ కణాల స్థానంలో కొత్త కణాలను తయారు చేయడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఇంకా ప్రొటీన్ పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో తింటే రోజంతా కూడా అసలు ఆకలిగా అనిపించదు.
మరింత సమాచారం తెలుసుకోండి: