తలనొప్పి తగ్గట్లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
తులసి టీ..ఈ తులసి టీని తాగడం వల్ల తలనొప్పి నుంచి మంచి ఉపశమనం అనేది పొందవచ్చు. ఇక తులసి ఆకులను ఇక ఒక రకమైన సహజ నివారణిగా కూడా భావిస్తారు. ఇది కండరాలను బాగా శాంతపరుస్తుంది. ఒక కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి బాగా మరిగించాలి.ఇక ఈ టీని మీరు నెమ్మదిగా తాగాలి. మీకు కావాలంటే కొంచెం తేనెను కూడా ఇందులో కలుపుకోవచ్చు.
పుదీనా టీ..ఇక పుదీనాలో అనాల్జేసిక్ లక్షణాలు అనేవి బాగా ఉంటాయి. ఇవి తలనొప్పిని తగ్గించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని దాని రసాన్ని తీసి మీ నుదుటిపై రాసుకుంటే చాలా మంచిది. ఇక కొన్ని నిమిషాల్లో తల నొప్పి తగ్గి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే పుదీనాతో కూడా టీని తయారు చేసుకొని తాగవచ్చు.
ఆవిరి తీసుకోండి..ఇక కేవలం తలనొప్పి మాత్రమే కాదు జలుబు వంటి సమస్యలను కూడా ఆవిరితో దూరం చేసుకోవచ్చు.ఇక దీని కోసం అల్లం పొడిని తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఇక ఆ అల్లం నీటి ఆవిరిని దుప్పటి కప్పుకొని బాగా పీల్చాలి. ఆవిరి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ముఖం వేడి నీటికి దగ్గరగా ఉండకూడదనే విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి.లేదంటే ఇది మీ చర్మంపై చెడు ప్రభావం చూపుతుంది.
అల్లం నుంచి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది..ఇక ఈ తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో అల్లం కూడా ఓ మంచి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక చెంచా అల్లం పొడిని తీసుకుని అందులో రెండు చెంచాల నీళ్లను కలిపి బాగా పేస్ట్‌లా చేయాలి. ఇక ఈ పేస్ట్ ను మీ నుదుటిపై కొన్ని నిమిషాల పాటు రాయాలి. ఇక ఇది మీ తలనొప్పికి మంచి మందులాగా పనిచేసి మంచి ఉపశమనం అనేది కలిగిస్తుంది.