ఊపిరితిత్తులను శుభ్రం చేసే చక్కని చిట్కా..!!
ఇక నిశ్వాస ఉచ్వాస ప్రక్రియలు సవ్యంగా జరిగినప్పుడు ఎటువంటి సమస్యలు దరిచేరవు. ఇకపోతే ఆ చిట్కాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఇందుకోసం మీరు ఒక పానీయం తయారు చేసుకోవాల్సి ఉంటుంది కావలసిన పదార్థాలు 10 లేదా 12 పుదీనా ఆకులు, చిన్న ముక్క అల్లం విడివిడిగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నీటిని పోసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో అల్లం పేస్టు , పుదీనా పేస్టు వేసి , చిటికెడు పసుపు కూడా వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి బాగా ఉడికించి నీటిని వడగట్టి అందులో కొద్దిగా తేనె కలుపుకొని తాగాలి.
ఇలా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పానీయాన్ని సేవించడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే నిమ్ము, కఫం అన్ని తొలగిపోయి దగ్గు , జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి. గొంతు ఇన్ఫెక్షన్లు ఏవైనా ఉన్నా సరే ఇట్టే తొలగిపోతాయి. అల్లం , పుదీనా, పసుపు, తేనె ఇలా అన్నీ కలగలిసిన పానీయం సేవించడం వల్ల శ్వాసకు సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఇట్టే తొలగిపోతాయి. చిన్నపిల్లల అయితే అర గ్లాసు పెద్ద వాళ్ళు అయితే ఒక గ్లాసు ఈ పానీయం సేవించవచ్చు..