ఈ పండుతో ఖర్చు తక్కువ.. ఆయుష్యు ఎక్కువ.. ఎలాగంటే..?

Divya
ప్రకృతిలో లభించే ఎన్నో పండ్లు మన శరీరానికి ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా చాలా చక్కగా పనిచేస్తాయి.. అందుకే ఎటువంటి ఆహారాలను తిన్నా.. తినకపోయినా.. సరే మనం తీసుకునే రోజువారీ ఆహారంలో తప్పకుండా ఏదో రకం పండును జోడించాలి అని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇకపోతే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లు ఏవి ఉంటాయా అని ఆలోచిస్తున్నారా..? అవే అండి అందరికీ అందుబాటులో ఉండే జామ పండు.. జామ పండు అతి తక్కువ ఖర్చుతో మనకు లభించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మనకు జామ పండు మాత్రమే కాదు జామ ఆకులు, బెరడు, వేర్లు ఇలా అన్నీ కూడా జామ చెట్టు కి సంబంధించిన ప్రతి భాగము మనకు ఆరోగ్యాన్ని అంధిస్తుంది..
జామపండు వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం.. జామ పండు తినడం వల్ల.. దంతాలకు బలం చేకూరడమే కాకుండా చిగుళ్లవాపు, చిగుళ్ల నొప్పి , నోటి పూత, గొంతు నొప్పి, నోటిలో పుండ్లు ఇలా  అన్ని సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా నోటి పూత ఎక్కువై బాధపడుతున్నవారికి జామ ఆకులు నమలడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.. నాలుగు లేదా ఐదు జామ ఆకులను తీసుకుని వేడి నీటిలో బాగా మరిగించి..చల్లార్చి.. వడగట్టుకుని ఆ నీటిని తాగడం వల్ల జలుబు వల్ల వచ్చే సమస్యలు దూరం అవుతాయి.. ఈ కషాయం సేవించడం వల్ల నడుము నొప్పి సైతం పరార్ అవుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
జామకాయలు  తినడం వల్ల  గుండె సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి..జామ ఆకు తో తయారు చేసిన కషాయం తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమయ్యి హాయిగా నిద్రపడుతుంది. అంతేకాదు ఈ కషాయంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా తగ్గుతుంది. అనుకోని పరిస్థితుల్లో క్యాన్సర్ కారక వైరస్ శరీరంలో ప్రవేశించినప్పుడు  ఈ కషాయం లో ఉండే యాంటీబయోటిక్స్  వైరస్ తో పోరాడి మనకు క్యాన్సర్ రాకుండా సహాయపడతాయి. జామ పండు తినడం వల్ల శరీరంలో రక్తం వృద్ధి చెంది.. అన్ని అవయవాలకు చక్కగా రక్తం సరఫరా అయ్యేలా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: