బరువు తగ్గాలా.. అయితే ఉదయం లేవగానే ఇలా చేయండి?

praveen
నేటి రోజుల్లో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ప్రతి పనిలో మనిషికి శారీరక శ్రమ ఉండేది. కానీ నేటి రోజుల్లో మాత్రం టెక్నాలజీ పెరిగిపోవడంతో మానసిక శ్రమ తప్ప శారీరక శ్రమ ఎవ్వరికీ ఉండటం లేదు. ప్రతి ఉద్యోగంలో కూడా ఒకేచోట గంటల తరబడి కూర్చుని పని చేసేది ఉండటంతో ఇక శారీరక శ్రమ లేకపోవడం తో ఎంతో మంది ఊబకాయులుగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఉరుకులు పరుగుల జీవితంతో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకపోవడంతో ఎవరు కూడా వ్యాయామం చేయడానికి కాస్త సమయాన్ని కూడా కేటాయించలేక పోతున్నారు.

 ఈ క్రమంలోనే తిని కూర్చోవడం వల్ల తెలియకుండానే బరువు పెరిగిపోవడం  ఊబకాయులు గా మారి పోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంది. ఇలా ఒకసారి బరువు పెరిగిన తర్వాత ఇక వెయిట్ లాస్ కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా వెయిట్ లాస్ అవ్వక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.. ఇలా బరువు పెరిగి పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు చిన్న చిట్కాలతో బరువును తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఉదయం లేవగానే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అంతేకాకుండా ఉదయం పూట కేవలం టిఫిన్ లాంటి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఉదయం టైం లో టిఫిన్ మానేసి నట్లయితే బరువు సులభంగా పెరిగిపోయే అవకాశం ఉంటుందట. అంతే కాకుండా ఇక ఉదయం సమయంలో అల్పాహారం కింద కేవలం ఇడ్లీ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అని అంటున్నారు నిపుణులు. ఇడ్లి లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందట. ఇక ఉదయాన్నే లేచి ఖాళీ కడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయట. అంతేకాకుండా పరగడుపున ఒక గ్లాసు నిమ్మ రసం తీసుకుంటే త్వరగా బరువు తగ్గిపోవచ్చట. ఇక జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటూ ఆకలిగా ఉన్నప్పుడు యాపిల్ ను స్నాక్స్ గా తీసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: