వాము ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఆగరు..!!

Divya
ప్రతి ఒక్కరి వంటింట్లో వాము అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాము తినడం వల్ల కడుపు నొప్పి సమస్య తగ్గిపోవడమే కాకుండా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటోంది. అసలే శీతాకాలం పైగా ఈ కాలంలో చాలామంది దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా దగ్గు, జలుబుల కారణంగా చికాకుకు గురికావడమే కాకుండా ఈ సమస్యలను దూరం చేసుకోలేక ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు.

ఇప్పుడు చెప్పే చిట్కా వల్ల శ్వాస రంధ్రాలను శుభ్రం చేయడంతోపాటు దగ్గు , జలుబు వంటి సమస్యల నుండి కూడా దూరం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పే చిట్కా మనం ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఇకపోతే ఈ చిట్కా కు కావాల్సిన అన్ని పదార్థాలు కూడా వంట ఇంట్లో సులభంగా దొరుకుతాయి కాబట్టి కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది..ఎలాంటి సమస్యలను అయినా ఇట్టే దూరం చేసుకోవచ్చు.ఇందుకోసం మీరు ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి..అందులో ఒక టేబుల్ స్పూన్ వాము, 10  పుదీనా ఆకులు, రెండు కర్పూరం బిళ్ళలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి.


ఈ నీరు బాగా మరుగుతున్నప్పుడు  పొయ్యి మీద నుంచి దించి.. దుప్పటి సాయంతో ఆవిరిని కొంతసేపు ముక్కుతో.. మరి కొంతసేపు నోటితో పీల్చడం వల్ల శ్వాస నాళాలు శుభ్రపడి ఊపిరితిత్తుల్లో కఫం బయటకు త్వరగా  వచ్చేస్తుంది.రోజుకు  రెండు సార్లు చొప్పున ఈ విధంగా చేస్తే దగ్గు, జలుబు నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. కర్పూరం మంచి వాసన ఇవ్వటమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.  ఫలితంగా మనకు దగ్గు, జలుబు తొందరగా తగ్గుతాయి.ఇక పుదీనా ఘాటైన వాసన కలిగి ఉండటం వల్ల శ్వాస సమస్యలను త్వరగా  తగ్గిస్తుంది. వాములో ఉండే ఘాటైన రసాయనాలు మనకు  జలుబు, దగ్గు తగ్గించడంలో సహాయపడటమే కాకుండా కఫం కరగడంలో కూడా ఈ వాము బాగా  సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: