మొటిమలు రావడానికి కారణం.. మీకు తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో మహిళలు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడిచ్చిన సహజమైన అందానికి మరింత మెరుగులు దిద్ది ఇంకాస్త అందంగా కనిపించడానికి మేకప్ ను ఉపయోగిస్తున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఇలా అందంగా కనిపించాలి అనుకునే ఎంతోమంది మహిళలకు నేటి రోజుల్లో పెద్ద సమస్యగా మారింది ఏంటి అంటే టక్కున చెప్పేస్తారు మొటిమలు అని. ముఖం మీద మొటిమలు వచ్చాయంటే చాలు చాలా మందితమ ముఖం అంతా అందంగా కనిపించడం లేదు అంటూ ఫీలవుతూ వుంటారు. ఇక మొటిమలు తగ్గించడానికి మహిళలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పాలి.


 ఇక మొటిమలను తగ్గించుకోవడం డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఎన్నో డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలా డాక్టర్ల సలహాలతో మొటిమలు తగ్గకపోతే వంటింటి చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఇలా ఏదో ఒక విధంగా మొటిమలు తగ్గించుకోవడానికి మాత్రం మహిళలు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతకీ మొటిమలు తగ్గకపోగా పెరుగుతూ ఉండడంతో మహిళలు ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. మొటిమల మొహంతో పదిమందిలో కి వెళ్లడానికి కూడా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు.


 అయితే ఇలా ముఖం పై మొటిమలు రావడానికి ప్రధాన కారణం ఏమిటి అన్న దానిపై మాత్రం చాలామందికి క్లారిటీ ఉండదు. ముఖం పై మొటిమలు రావడానికి 'సెబామ్' అనే ద్రవం కారణం అవుతుందట. దీన్ని  ల్యూకో ట్రాయిస్ బి4 అనే పదార్థం ఉత్పత్తి చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఆహారంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్న సమయంలో మొటిమలు వచ్చే అవకాశం ఉంటుం దట. ఇక మొటిమలను తగ్గించుకోవాలంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్, బీన్స్, గుడ్లు, అవిసె గింజల్లో ఇవి ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు వీటిని మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో తీసుకోవచ్చు అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: