మీరు ఎక్కువగా కొత్తిమీర వాడుతున్నారా..మీరు డేంజర్ లో ఉన్నట్లే..!
తాజాగా కొంతమంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ ఆకు పై పరిశోధనలు చేసి కొన్ని భయంకరమైన విషయాలు తెలియజేశారు. అవి ఏమిటంటే కొత్తిమీర పండించే అప్పుడే కొన్ని కెమికల్స్ ను అందులోకి వేసి వాటిని పండిస్తున్నట్లుగా వారు గుర్తించారు. ఏరా సల్ఫర్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల అది చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. అంతే కాకుండా ఎక్కువ రోజులు కూడా ప్రెష్ గానే కనిపిస్తుందట. ఇదంతా కేవలం వ్యాపారస్తులు ఇలాంటి పన్నాగం పడుతున్నారని తెలియజేశారు ఆ బృందం.
ఈ కొత్తిమీర ఆకుపై సల్ఫర్ ను ఉపయోగించడం వల్ల మానవుని శరీరంలోని చాలా అనర్థాలకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు. కానీ కొంతమంది వ్యాపారస్తులు మాత్రం సల్ఫర్ ఉపయోగించడం మంచిదని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతులు పంటను కోసినప్పుడు.. వారు ఆ కొత్తిమీర ను తీసుకు వచ్చే కు కనీసం రెండు రోజుల వ్యవధి పడుతుంది. అలాంటప్పుడు ఆ ఆకు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలాంటివి చేయాలని వారు తెలియజేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఈ సల్ఫర్ ను వాడడం వల్ల, మన శరీరంలో బ్యాక్టీరియాను, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకెందుకు సహాయపడుతుందని తెలియజేస్తున్నారు.
ఇక ఈ పదార్ధాలు అధికంగా వాడితే మాత్రం దగ్గు, కళ్లు మండటం, చర్మం మీద దద్దుర్లు వంటి వస్తాయని తెలుపుతున్నారు. ఇక కొత్తిమీర మార్కెట్ లోకి వెళ్లి తెచ్చుకున్న తర్వాత ఫ్రెష్ గా ఉన్నదని చెప్పి అన్ని వంటకాలలో కి వేస్తే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే కొత్తిమీర ను నీటితో బాగా శుభ్రం చేసుకొని ఉపయోగించుకోవడం మంచిదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలియజేస్తున్నారు.