బొద్దింకలు బాధిస్తున్నాయా.. ఇలా చేయండి ఇక కనిపించవు..?

MOHAN BABU
ప్రస్తుత కాలంలో  సీజనల్ వ్యాధుల వల్ల జనాలు జలుబు తలనొప్పి వంటివి ఎక్కువగా వస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం మనం కలుషితమైన ఆహారం తినడం వలన ఈ వ్యాధులు ప్రబలి మన ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇందులో ఎక్కువగా బొద్దింకలు  వాటి వల్లే ఆహారం కలుషితమై పోతుందని చెప్పవచ్చు. అయితే వీటి బెడదను తప్పించుకునే మార్గం లేదా..? అదేమిటో తెలుసుకుందాం..? అయితే బొద్దింకలను నుంచి తప్పించుకోవడానికి  చాలామంది  మన మార్కెట్లో దొరికే   స్ప్రై పదార్థాలను వాడతారు. వీటిని వాడటం వలన మనకు ఎలర్జీలు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మనం నివాస గృహాన్ని ఎంత  శుభ్రం చేసిన ఒక్కోసారి  మనకు ఇలాంటి ఇబ్బందులు వచ్చి పడుతూనే ఉంటాయి. ఇబ్బందులలో బొద్దింకలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మనం కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ బొద్దింకల బెడద నుంచి చాలా సులభంగా తప్పించుకోవచ్చు.

అవి ఏంటంటే మనం వాడే అటువంటి బిర్యానీ ఆకులను మన ఇళ్లలో ఉండే వంటగది మూలాల్లో పెట్టాలి. వీటి నుంచి వచ్చే వాసన వల్ల బొద్దింకలు ఆహార పదార్థాలపై, వంట గిన్నెల పై వెళ్ళవు. అలాగే మనం కర్రీస్ లో వాడుకునే అటువంటి లవంగాలు కూడా బొద్దింకలు పారిపోయేలా చేస్తాయని చెప్పవచ్చు.

సమయానికి అనుగుణంగా  వాటి బెడద తప్పించుకునేలా లవంగాలు కీలకంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే బోరిక్ పౌడర్ అనే చక్కెర కలిగినటువంటి మిశ్రమం కూడా బొద్దింకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రెండు పదార్థాలను సమపాళ్లలో కలిపి పెడితే బొద్దింకలు పరార్  అవుతాయి. వీటితో పాటుగా  వేపనూనె లేదా వేప ఆకులను రాత్రి సమయంలో మూలల్లో ఉంచాలి. ఉదయం లేచేసరికి మంచి ఫలితం కూడా కనిపిస్తుంది. ఈ బొద్దింకల బెడద తప్పించుకునేందుకు ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే చాలని వంటింటి నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: