ఆ టైంలో నిద్రలేస్తున్నారా? అయితే బాగా సంపాదిస్తారట..

Purushottham Vinay
నిద్ర అనేది ఈ భూమి మీద ప్రతి జీవ రాశికి కూడా దేవుడు ఇచ్చిన గొప్ప వరం. సాధారణంగా మనుషులు పగలు పనులు చేసుకోవాలి. రాత్రుళ్ళు నిద్ర పోవాలి. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇది పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఈ కాలంలో అనేక కంపెనీలు ఉద్యోగస్తులకు నైట్ షిఫ్ట్ లను అలవాటు చెయ్యడం జరిగింది. దీని వల్ల ఆరోగ్యం దెబ్బ తిని జబ్బుల బారిన పడటం ఖాయం. ఇక చాలా మంది కూడా పని పాట లేనోళ్ళు కూడా రాత్రిళ్ళు మేల్కొని చాలా లేటుగా పడుకుంటారు.ఉదయం చాలా లేటుగా నిద్ర లేస్తారు.కాని అది మంచి పద్ధతి కాదు.తొందరగా నిద్రలేచే వారు చాలా యాక్టీవ్ గా ఉంటారు. అందుకే వారిలో మెరుగైన పనితనం ఉంటుంది.అంతేకాదు వారు బాగా పని చేయగలిగి ఎక్కువగా జీతాలు, అద్భుతమైన జీవనశైలి పొందుతారని వెల్లడైంది.

ఇక ఉదయం పూట 6 గంటలకు నిద్రలేవాలని దాదాపు 40 శాతం వరకు అనుకుంటారు.6 గంటల లోపు నిద్రలేచే వారిలో మెరుగైన పనితనం అనేది ఉంటుంది. ఇక ఒక సర్వే ప్రకారం ఉదయం 4 గంటలకు నిద్రలేచే వారిలో దాదాపు 71శాతం మంది ఎక్కువగా మెరుగైన పనితనాన్ని కలిగి ఉంటారట. అలాగే లేటుగా నిద్రపోయి ఉదయం 11 గంటలకు నిద్రలేచే వారితో పోలిస్తే.. త్వరగా లేచే వారిలో ఎంతో మెరుగైన పనితనం అనేది ఉంటుంది.ఉదయం పూట చాలా తొందరంగా లేచే వ్యక్తులు.. సంవత్సరానికి దాదాపు 33 లక్షల దాకా ఈజీగా సంపాదిస్తారట. ఇక ఆలస్యంగా నిద్రలేచే వారు మాత్రం సంవత్సరానికి 22 లక్షలు దాకా సంపాదిస్తారట. అంటే ఆలస్యంగా నిద్రలేచే వారికంటే కూడా చాలా తొందరగా 4 గంటలకు నిద్రలేచే వారే దాదాపు 10 లక్షలు రూపాయలు ఎక్కువగా సంపాదిస్తారట.ఇక పొద్దున 4 గంటల నుంచి 5 గంటల మధ్య నిద్రలేచే వారు అందరి కంటే ఎక్కువగా రూ. 35 లక్షల వరకు సంపాదిస్తారట.ఇక మధ్యాహ్నం సమయంలో నిద్రలేచే వారు మాత్రం సంవత్సరానికి కేవలం రూ 16 లక్షలు మాత్రమే సంపాదిస్తారని వెళ్లడయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: