కరోనా నుంచి కోలుకున్న ఉత్తరప్రదేశ్.. రికవరీ రేటు ఎంతంటే ..?

Divya
భారత దేశంలో ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని అత్యధికంగా కరోనా రోగులు రోజురోజుకు మరణం పొందుతున్నారు అనే వార్తలు మనం రోజూ ఎక్కడో చోట వింటూనే ఉన్నాం.. కానీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు కూడా చాలా కట్టుదిట్టమైన కరోనా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల , ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై మూడు జిల్లాలు కరోనా నుంచి విముక్తి పొందాయని వార్తలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా కోవిడ్ రహితంగా మారిన జిల్లాలలో బాగ్ పత్, అమేథీ , చిత్రకూట్, బస్తి, బండ ,బీజ్నోర్, బేటా,
ఫరుకాబాద్, ఫతేపూర్ , గోండా, హర్దోయ్ ,హమీర్పూర్ మౌ, మహోబా, రాంపూర్ , సీతాపూర్ తో సహా మొత్తం 23 జిల్లాలు కరోన రహితంగా సురక్షితంగా బయట పడ్డాయి అని వైద్యులు సూచిస్తున్నారు మొత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 75 జిల్లాలు ఉండగా, తాజాగా రెండు అంకెలలో కేసులు నమోదు కాలేదని, గత 24 గంటల్లో ఏకంగా 62 జిల్లాలో ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేదు అని, కేవలం  మిగిలిన 13 జిల్లాల్లో మాత్రమే పది లోపు కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం..
మొత్తం ఉత్తరప్రదేశ్ లో 98.6 శాతం రికవరీ రేటు ఉన్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ముఖ్యంగా 3,10,783 మధ్య ఉన్న యాక్టివ్ కేసులు, ప్రస్తుతం 99 శాతానికిపైగా తగ్గినట్లు సమాచారం మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలలో వరుసగా 52,884 అలాగే 2,12,595 కేసులు నమోదయ్యాయి అట.
ఇక గత 24 గంటల్లో 1,87,638 మందిని పరీక్షించగా, 21 మందికి  మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి .. ఇక ఇదే  సమయంలో మరో 17 మంది రోగులు కూడా కోలుకున్నట్లు  సమాచారం. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 16,86,182 మందికి పైగా కరోనా బారి నుంచి తప్పించుకున్నారట.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కఠినమైన నిబంధనలను పెట్టడంతోనే , సుమారుగా వృద్ధి రేటు ఇంత వచ్చినట్లు అక్కడ అధికారులు సూచిస్తున్నారు. ఏదిఏమైనా రాష్ట్రంలో ఇంత వృద్ధిరేటు కలగడం ఆనందదాయకం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: