షుగర్ పేషెంట్స్ తినాల్సిన ఇంకా తినకూడని పండ్లు..

Purushottham Vinay
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి సంపూర్ణ ఆరోగ్యం. రోజు పండ్లని తింటే ఎంతో పుష్టిగా ఆరోగ్యంగా వుంటారు. ఇక షుగర్ పేషెంట్లు తినాల్సిన తినకూడని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకోండి.మామిడి పళ్లంటే దాదాపు అందరూ కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక మీడియం సైజు మామిడి పండులో 45 గ్రాముల చొప్పున చక్కెర ఉంటుంది. ఒకవేళ మీరు అధిక బరువు తగ్గాలనుకుంటే.. ఎక్కువగా మామిడి పండ్లను తినడం మానుకోవడం చాలా మంచిది. ఇక ఒక రోజులో ఒకటి నుంచి రెండు మామిడి పండ్ల ముక్కలను మీరు తినొచ్చు.ఒక కప్పు ద్రాక్ష పండ్లలో 23 గ్రాముల చక్కెర అనేది ఉంటుంది. సాధారణ పరిమాణంలో వీటిని తినవచ్చు. ఎందుకంటే వీటిలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ద్రాక్షా పండ్లను జ్యూస్‌, షేక్స్ ఇంకా వోట్ మీల్‌ ద్వారా కూడా తినవచ్చు.అలాగే ఒక కప్పు చెర్రీస్‌లో 18 గ్రాముల చక్కెర అనేది ఉంటుంది.అందువల్ల మీరు తిన్న పండ్లు తిన్నారో.. ఎంత షుగర్ ఆ పండ్లలో ఉంటుందో సులభంగా అంచనా వేయొచ్చు. చెర్రీస్‌ను తక్కువగా తింటే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.


ఇక ఒక పియర్‌లో 17 గ్రాముల చక్కెర అనేది ఉంటుంది. మీరు తక్కువ తినాలనుకుంటే మొత్తం పండు కి బదులుగా కేవలం కొన్ని ముక్కలు కట్ చేసుకుని సులభంగా తినొచ్చు. పియర్‌ను పెరుగు ఇంకా సలాడ్‌లో కూడా వేసుకుని తినొచ్చు.ఒక మీడియం సైజ్ పుచ్చకాయలో 17 గ్రాముల చక్కెర అనేది ఉంటుంది.ఇక ఈ పుచ్చకాయలో అధిక శాతం నీరు ఇంకా ఎలక్ట్రోలైట్ ఖనిజాలు అనేవి ఉంటాయి. ఇవి శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. ఒకేసారి రెండు పుచ్చకాయ ముక్కలని కూడా తినొచ్చు.ఇక అరటి పళ్లలో శక్తి అనేది సమృద్ధిగా ఉంటుంది. ఒక మీడియం సైజు అరటి పండులో 14 గ్రాముల చక్కెర అనేది ఉంటుంది. మీరు ఉదయం పూట అల్పాహారంలో ఈ అరటి పండును తినొచ్చు.ఒక అవోకాడోలో 1.33 గ్రాముల చక్కెర అనేది ఉంటుంది. మీరు దీనిని సలాడ్లు ఇంకా టోస్ట్‌లలో కలిపి తినొచ్చు. ఇక ఈ పండ్లలో షుగర్ లెవల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అయినా కానీ ఇందులో అధిక కేలరీలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: