
వర్షాకాలం తల్లి కాబోతున్న మహిళలు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు ?
గర్భిణీ మహిళలు ముందుగా కరోనా టీకా వేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో వైద్యులను సంప్రదించడం చాలా మంచి నిర్ణయం. కరోనా టీకా వేయించుకోవడం కారణంగా తల్లితో పాటు... పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.
హైడ్రేట్
ముఖ్యంగా వానాకాలంలో చాలా మంది నీళ్లు తాగడం మరిచిపోతున్నారు. ఈ వానా కాలంలో దాహం ఎక్కువగా కాదు.. దీంతో నీళ్లు ఎక్కువగా తాగరు. అయితే... ఈ వర్షకాలంలో గర్భిణి స్త్రీలతో సహా... ప్రతి ఒక్కరూ 2.5 లీటర్ల కంటే ఎక్కువగా నీళ్లు తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే.. ఐస్‌క్రీమ్, కాపీ, టీ తదితర ద్రవ పదార్థాలను తీసుకుంటే మంచిదని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.
విటమిన్ -సీ
గర్భిణులకు విటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉండేటు వంటి సిట్రస్ ఆహారాలను తీసుకోవాలి గర్భిణులు. నారింజ, దానిమ్మ, నిమ్మ, ఉసిరి లాంటి జ్యూస్ లు తాగితే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శారీరక శ్రమ
గర్భిణులకు కాస్త.. శారీరక శ్రమ అవసరం. అందుకే గర్భిణులు నడవటం, కాస్త వ్యాయామం చేయటం కచ్చితంగా అవసరమని వైద్యుల వాదన. అలాగే.. గర్భిణులు నడిచే సమయంలో... చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు.
కరోనా వైరస్ జాగ్రత్తలు :
కరోనా వైరస్ పట్ల గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌లు ధరించటం, సోషల్ డిస్టాన్స్ మరియు శానిటైజర్ వాడకం లాంటి గర్భిణులకు చాలా ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు.