దేవుడా.. ఈ ద్రాక్ష గుత్తి ధర ఏకంగా అన్ని లక్షలా..?

Suma Kallamadi
ద్రాక్ష పండు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. పిల్లల దగ్గర నుండి పెద్దల దాక అందరు  ద్రాక్ష పండును ఇష్టంగా తింటారు. ద్రాక్ష పండు ఎంతో రుచికరంగా, తియ్య తియ్యగా,పుల్ల పుల్లగా ఉంటుంది. దీని విలువ కూడా మహా అయితే ఒక కిలో 100 నుండి 150 రూపాయిల దాక ఉంటుంది కదా. కానీ, అక్కడ పండే ఎర్రని ద్రాక్ష గుత్తి ధర మాత్రం 11 వేల డాలర్లు అంట.అంటే మనం భారత దేశ కరెన్సీలో అక్షరాల రూ.7.5 లక్షలు అన్నమాట. ఏంటి అంత రేటా అని షాక్ అయ్యారా? కానీ మీరు విన్నది నిజం.అంతేకాకుండా ఈ ద్రాక్ష గుత్తి  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా కూడా  రికార్డు నమోదు చేసింది.అసలు వివరాల్లోకి వెళితే…

ఈ ఖరీదైన ద్రాక్ష పండ్లను రుబీ రోమన్ గ్రేప్స్‌గా(Ruby Roman grapes) పిలుస్తారుఈ ద్రాక్ష పండ్లను జపాన్‌లోని ఇషికావా దీవిలో ఒక పరిమిత సంఖ్యలో 2008 నుంచి పండించడం మొదలుపెట్టారు. సీజన్ లో మొదటి విక్రయానికి ముందు ఒక ద్రాక్ష గుత్తిని వేలానికి పెడతారు. 2019లో మొదటి ద్రాక్ష గుత్తిని కనజవాలో వేలానికి పెట్టాగా జపాన్‌కు చెందిన ఓ కంపెనీ ఈ ద్రాక్ష గుత్తిని రూ.11 వేల డాలర్లను చెల్లించి సొంతం చేసుకుంది. ఈ గుత్తిలో మొత్తం 24 ద్రాక్ష పండ్లు దాక ఉన్నాయి.ఒక్కో పండు బరువు 20గ్రాములపైనే ఉంది. ఈ ద్రాక్ష పండ్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి చాలా తియ్యగా, అతి తక్కువ ఆమ్ల గుణాలు కలిగిన రసాలతో  ఉంటాయని తెలిపారు.

సాధారణ రోజుల్లో మాత్రం ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.31,537 వరకు ఉంటుందన్నారు. మొదటి గుత్తి వేలం పాటలో మాత్రం వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుందట. ఈ ద్రాక్ష పండ్లను ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇవ్వడానికి కొంటారట. మోత్తంగా లగ్జరీ ఫ్రూట్‌గా పేరుగాంచిన ఈ ఖరీదైన ద్రాక్ష కోసం సంపన్నులు క్యూ కట్టి మరి కొనుగోలు చేస్తారట. ఒక్క ద్రాక్ష గుత్తుకి ఇంత మొత్తంలో డబ్బులు చెల్లించి మరి కొనడం అంటే మాములు విషయం కాదు.ఆస్తులు అమ్ముకోవాలిసిందే అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: