ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
సాధారణంగా అయితే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకుంటారు. అయితే ఎంత ఇష్టం లేకపోయినప్పటికీ ఆషాడమాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలని అటు పెద్దలు సూచిస్తూ ఉంటారు. ఇలా గోరింటాకు పెట్టుకోవడం అనే ఆచారం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఒకప్పటి పెద్దల కైతే తెలుసు.. కానీ నేటి జనరేషన్ పిల్లలకు మాత్రం ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు.
అయితే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంది అని అంటున్నారు నిపుణులు. ఆషాడం వచ్చింది అంటే అటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఆషాడం ముందు నుంచి వర్షాలు కురుస్తూ ఉంటాయ్. దీంతో అప్పటివరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పోతూ ఉంటుంది. గ్రీష్మరుతువు తో వేడి గా మారిన మన శరీరం.. వర్ష ఋతువు ప్రారంభం అయినప్పటికీ కూడా అదే వేడితో ఉంటుందట. ఈ క్రమంలోనే ఆషాడంలో ఇక గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరం వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఎంతో ఉపయోగ పడుతుందని చెబుతున్నారు నిపుణులు.