మహిళలకు గుండె సమస్యలు రాకుండా ఇలా చెయ్యండి..

Purushottham Vinay
కరోనా మహమ్మారి చాలా దారుణంగా వ్యాప్తి చెందుతుంది. పైగా తాజాగా తేలిన విషయం ఏమిటంటే మహిళలకు చాలా మందికి ఈ టైం లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయట. వాటిని తగ్గించుకోవడానికి ఈ పద్ధతులు పాటించండి. ధూమపానం, మద్యపానం గుండెకు చాలా హాని చేస్తాయి.ఈ రోజుల్లో మహిళలు కూడా ధూమపానం, మద్యపానానికి అలవాటు పడిపోయారు. ఇవి హృదయ సంబంధిత సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి మీరు ధూమపానం, మద్యపానం మానేయడం మంచిది. వీటి వల్ల అనారోగ్యమే వస్తుంది. కానీ ఎటువంటి ఆరోగ్యం మీకు కలగదు కనుక వీటికి దూరంగా ఉండటం మంచిది.ఒబెసిటీ మంచిది కాదు. ముఖ్యంగా మహిళలు అధికబరువు ఉండకూడదు. బీఎంఐ 25 కంటే ఎక్కువ ఉంటే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.



కాబట్టి దానికంటే తక్కువ ఉండడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేయడం బరువు తగ్గడం వంటివి అనుసరించడం మంచిది.తక్కువ ఫ్యాట్ తక్కువ సాల్ట్ మీ డైట్‌లో తీసుకుంటూ ఉండండి. ఎంత తక్కువ సాల్ట్‌ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఉప్పు వల్ల రుచితో ముప్పు కూడా వస్తుందని ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. కాబట్టి ఎంత తక్కువ వాడితే అంత మంచిది.ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవచ్చు. అదే విధంగా గింజలు, నట్స్, కాయగూరలు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. అలానే మీరు గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే వీటిని కట్ చేయాలి. ప్యాకెట్ ఫుడ్, షుగర్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మీరు వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి.



ఇక వ్యాయామం, జిమ్ చెయ్యడం చాలా మంచిది.రోజు వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. బ్రిస్క్ వాకింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ లాంటివి తప్పనిసరిగా చేయాలి. ఇంటి లోపల యోగా చేయడం మెడిటేషన్ చేయడం ఏరోబిక్స్ చేయడం లాంటివి చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు ఫిట్ గా ఉండేటట్టు చూస్తుంది.కాబట్టి ప్రతి మహిళా ఫిజికల్ యాక్టివిటీకి కాస్త సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం.ఇక ఈ పద్ధతులు పాటిస్తే మహిళలకి ఎలాంటి గుండె సమస్యలు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: