ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిత్యం ఈ 6 రుచులు తప్పకుండా మన ఆహరం లో తీసుకోవాలట .. అవి ఏంటో తెలుసా.. ?

Divya

నిత్యం మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన తీసుకునే ఆహారం తప్పకుండా పోషకాలను కలిగి  ఉండాలి . అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి పోషకాలు లేనట్లయితే , ఆ ఆహరం తీసుకున్నా అది వృధా అవుతుంది . అందుకే మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఆ ఆరు రుచులు తీసుకోవడం ఎంతోమంచిది. అయితే  ఆ ఆరు రుచులు ఏవేవో.. వాటి వాళ్ళ మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. అన్న విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం ..  

1. తీపి : సాధారణంగా తీపిని ఇష్టపడని వారంటూ వుండరు . అంతేకాకుండా తీపి శుభప్రదానికి చిహ్నం కూడా. తీపి పదార్థాలు తినడం వల్ల ఆయుర్దాయం పెరగడం తో పాటు శరీర దృఢత్వం  కూడా మెరుగుపడుతుంది .అలాగే శరీరం లోని వాత ,పిత్త దోషాలను నయం చేస్తుంది . శరీరానికి కావలసిన శక్తి అందుతుంది . అయితే ఈ తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం ,డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఈ తీపి రుచి కలిగి ఉన్న ఆహార పదార్థాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు..
2. ఉప్పు:
ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వాత దోషం తక్కువవుతుంది .అయితే ఉప్పు అధికమైతే పిత్త,  కఫ దోషాలు పెరుగుతాయి ..ఇది గుర్తుంచుకోవాలి ఇక ఆహార పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి, కణాలు శుభ్రం అవుతాయి. అయితే ఉప్పు ఉన్న పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి . లేకపోతే బీ పీ ఎక్కువ అవడం, గుండె జబ్బులు రావడం వంటివి జరగవచ్చు.
3. పులుపు:
వాత దోషాలను ఈ పులుపు తగ్గిస్తుంది . అయితే ఈ రుచి ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. కానీ ఈ పులుపు కలిగిన పదార్థాలను తక్కువగా తీసుకోవాలి . లేకపోతే పిత్త , కఫ దోషాలు పెరుగుతాయి.
4. కారం:
కారం ఉన్న పదార్థాలను తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఇక అలాగే కఫ దోషం తగ్గుతుంది . కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది . కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవాలి.
5. చేదు:
చేదు ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అందుకే చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల పెద్దగా సమస్యలేమీ ఉండవు...
6. వగరు:
వగరు వున్న పదార్థాలను కొద్ది మొత్తంలో తీసుకోవడం  వల్ల పిత్త దోషం ఉన్నవారికి త్వరగా ఈ సమస్య నుంచి కోలుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: