పొట్ట పెరిగిందని బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...

kalpana

 చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు పెరగడానికి శారీరక  శ్రమ లేకపోవడం, మారిన ఆహారపు అలవాట్లు, ఎక్కువ  కాసేపు కూర్చుని పనిచేయడం వంటివి చేయడం వల్ల అధిక బరువు పెరుగుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరికీ బాధిస్తూనే ఉంది. చాలామందికి అధిక బరువుతో పాటు పొట్ట మాత్రం ఎక్కువగా ముందుకు వచ్చి ఉంటుంది. పొట్టను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.  అయినా ఫలితం మాత్రం శూన్యం. కొన్ని చిట్కాలు ఉపయోగించడం వల్ల పొట్టను  ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు  గురించి వివరంగా తెలుసుకుందాం...

 పొట్ట ఎక్కువగా ఉన్నది అని బాధ పడుతున్న వాళ్ళు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగాలి. అలాగే ఉదయం లేవగానే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగాలి. కానీ గ్యాస్ ఉన్న వాళ్ళు పచ్చి వెల్లుల్లిని తినకపోవడం మంచిది. ఒకవేళ తినాలనుకుంటే 2  వెల్లుల్లి రెబ్బలను తీసుకొని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గుతుంది. అంతేకాకుండా ఉదయం వెల్లుల్లిని  తిన్న తర్వాత  పంచదార లేకుండా ఒక గ్లాసు గోరువెచ్చని ననిమ్మరసం తాగాలి. లేదా నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 పొట్ట పెరిగిపోతూ ఉన్నప్పుడు వైట్ రైస్ తినడం మానుకోవడం మంచిది. దీనికి బదులు రెడ్ రైస్, గోధుమ బ్రెడ్, ఓట్స్ బ్రెడ్డు తినడం వల్ల క్రమంగా పొట్ట తగ్గుతుంది.

 బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు వంటల్లో కచ్చితంగా  దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, అల్లం ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వీటి వల్ల అధిక బరువు తగ్గుతారు.

 చాక్లెట్లు, ఐస్ క్రీమ్, షుగర్ తో చేసిన ఆహార పదార్థాలను తినకపోవడం  ఉండటం మంచిది. మాంసాహారానికి కూడా దూరంగా ఉండటం మంచిది. గుడ్డు, చేపలు ఇలాంటివి తక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల  పొట్ట తగ్గుతుంది.

 నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ప్రతిరోజు  తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. అంతేకాకుండా  యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.

 ముఖ్యంగా  మంచి నీరు ఎక్కువగా తాగాలి. ఎందుకంటే   నీరు  బాగా తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని  మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి పైన చెప్పిన చిట్కాలను ఫాలో అవ్వడం వల్ల తొందరగా పొట్టను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: