వీగన్ డైట్ అంటే ఏమిటి..! దాని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా..?
సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా లేదా అధిక బరువును తగ్గించుకోవాలన్నా మన రోజువారీ దినచర్యలో తప్పకుండా డైట్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది . ఇక అందులో భాగంగానే ప్రస్తుతం మనకు అనేక రకాల డైట్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో వీగన్ డైట్ కూడా ఒకటి. వీగన్ డేట్ అంటే ఏమీ లేదండి. కేవలం శాకాహార పదార్థాలను మాత్రమే తినాలి. అంటే కేవలం వృక్ష సంబంధిత పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. జంతు సంబంధిత పదార్థాలను తినకూడదు. ఏ ఏ శాకాహార పదార్థాలను తినాలో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
వీగన్ డైట్ లో తినవలసిన ఆహార పదార్థాలు: పండ్లు ,బటానీలు, చిక్కుడు జాతి గింజలు, కాయగూరలు, పప్పు దినుసులు, రైస్, పాస్తా ,బెడ్,సోయా మిల్క్ ,కొబ్బరి పాలు, బాదం పాలు
వీగన్ డైట్ లో తినకూడని ఆహార పదార్థాలు:
బీఫ్, మటన్ ,చికెన్ ,చేపలు,ఇతర మాంసాహారాలు, కోడిగుడ్లు, పాల మీద మీగడ, ఇతర పాల ఉత్పత్తుల ఆహార పదార్థాలను తీసుకోరాదు.
వీగన్ డైట్ వల్ల కలిగే లాభాలు:
శాఖాహార డైట్ ను పాటించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శాఖాహార డైట్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా తెలిపారు.
శాకాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుందని, హైబీపీ కూడా తగ్గుతుందని సూచించారు.
డయాబెటిస్ ,క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
అధిక బరువు పెరగకుండా ఉండేందుకు ఎంతో సహాయపడుతుంది.
వీగన్ డైట్ వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని సైంటిస్టులు అధ్యయనంలో వెల్లడించారు.
అంతేకాకుండా ఈ వీగన్ డైట్ వల్ల సన్నగా, ఆరోగ్యంగా, అందంగా ఉండడమే కాకుండా యాక్టివ్ గా కూడా ఉండవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ డైలీ దినచర్యలో ఈ వీగన్ డైట్ లో చేర్చుకొని సత్వర ఫలితాలను పొందాలని మేం కూడా కోరుకుంటున్నాం.