మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లని తినండి.....

Purushottham Vinay
మధుమేహ బాధితులు ఈ పండ్లు తింటే వారి ఆరోగ్యానికి చాలా మంచిది.మధుమేహ బాధితులు బొప్పాయి తినడం చాలా మంచిది. ఇందులో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. క్రమరహిత బ్లడ్ షుగర్స్ వల్ల నరాలకు, గుండెకు చాలా నష్టం కలుగుతుంంది. అయితే, బొప్పాయి.. కణాల నష్టాన్ని అరికట్టి మరింత కాలం జీవించేందుకు సహకరిస్తుంది. అలాగే, ఆరెంజ్‌లో ఉండే ఫ్లావనోనెస్, ఫెనోలిక్ యాసిడ్లు సైతం డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తాయి. మధుమేహం ఉంటే పుచ్చకాయ తినకూడదని అంటారు. అయితే, కిడ్నీలకు మేలు చేసే మంచి ఫలం పుచ్చకాయ. డయాబెటిస్‌ బాధితులు పుచ్చకాయ తిన్నట్లయితే మూత్రపిండాలకు మేలు జరుగుతుంది. మధుమేహ బాధితులకు నరాలు సైతం దెబ్బతింటాయి. కాబట్టి.. పుచ్చకాయలో కనుగొన్న లైకోపెనే ఆ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది.


డయాబెటిస్ బాధితులకు జామ పండు చాలామంచిది. ఇందులో కూడా గ్లెసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఆకలితో ఉన్నప్పుడు చిల్లర తిండ్లకు బదులు జామ కాయాలను తింటే ఎంతో మేలు. డయాబెటిస్ ముప్పు నుంచి కూడా జామ పండ్లు కాపాడతాయి.లో-గ్లైసెమిక్ ఇండెక్స్ గల పండ్లలో స్ట్రాబెర్రీస్‌ ఒకటి. ఇది ఇమ్యూనిటీని కూడా పెంపొందిస్తుంది. ఇది క్యాన్సర్ కణాలతో సైతం పోరాడుతుంది. అలాగే, జీవక్రియను సైతం పెంపొందిస్తుంది. బరువును తగ్గించేందుకు కూడా స్ట్రాబెర్రీస్‌ సహకరిస్తాయి.బ్లూబెర్రీ, నల్లద్రాక్షతో కలిపి యాపిల్ పండ్లను తినడం చాలామంచిది.ఇది టైప్-2 డయాబెటీస్‌ను తగ్గిస్తుంది.ఇక డయాబెటిస్ పేషెంట్లకి ద్రాక్ష కూడా చాలా మంచిదట.ఇది రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. అయితే, డయాబెటిస్ బాధితులకు కేవలం నల్ల ద్రాక్ష మాత్రమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.


ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంటున్న సీడ్‌లెస్ ద్రాక్షను మాత్రం అతిగా తీసుకోవద్దని, తినాలపిస్తే.. రోజుకు ఒక కప్పు తీసుకోండని తెలుపుతున్నారు. అయితే, నల్ల ద్రాక్ష ఈ ద్రాక్షలు కంటే మెరుగ్గా పనిచేస్తుందని, డయాబెటిస్‌కు మేలు చేస్తుందని అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. చక్కెర వేయకుండా ద్రాక్ష పండ్ల రసాన్ని తీసుకోవడమే మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: