కుప్పింటాకు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..?

kalpana
సాధారణంగా మనం ఆయుర్వేదంలో ఎన్ని రకాల వనమూలికలను ఉపయోగిస్తూ ఎన్నో రకాల వ్యాధులను నియంత్రిస్తున్నాము. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఇలాంటి వనమూలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ విధమైనటువంటి వనమూలికలలో కుప్పింటాకు ఒకటి.
ఈ కుప్పింటాకు ప్రతి ఒక్క భాగంలోనూ ఎన్నో ఔషధగుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకు ద్వారా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కుప్పింటాకు ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం....                                                 

దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారికి కుప్పింటాకు టీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆకుల ద్వారా తయారు చేసుకున్న టి ఒక కప్పు తాగటం వల్ల ఈ సమస్యల నుంచి విముక్తి పొందటమే కాకుండా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని కూడా అందిస్తుంది. అదేవిధంగా ఏదైనా గాయం తగిలినప్పుడు ఈ కుప్పింటాకును మెత్తగా రుబ్బి అందులో కొద్దిగా పసుపు కలిపి గాయమైన చోట రాయటం వల్ల గాయం తొందరగా మానవుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడే వారికి ఈ కుప్పింటాకు ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.

అధిక కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ కుప్పింటాకు మిశ్రమాన్ని కాస్త కొబ్బరినూనెలో తక్కువ మంట వద్ద వేడి చేసుకుని శరీరం మొత్తం రాసుకోవడం వల్ల శరీరంలో ఏర్పడే నొప్పులు తొలగిపోతాయి. ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగటం వల్ల మన కడుపు లో ఉన్నటువంటి నులిపురుగులు బయటకు తొలగించడమే కాకుండా కడుపు నొప్పి సమస్య నుంచి విముక్తిని కల్పిస్తుంది. అదేవిధంగా ఈ ఆకుల మిశ్రమాన్ని బాగా నూరిఅందులో కొద్దిగా పసుపు కలిపి ముఖంపై రాసుకోవడం వల్ల ముఖం పై ఏర్పడిన మొటిమలు మచ్చలు కూడా తొలిగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. ఈ కుప్పింటాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: