పక్షవాతం వచ్చిన వారికి ఆయుర్వేదం ద్వారా చేసే చికిత్స పనికొస్తుందా..?

Divya

పక్షవాతం ఎప్పుడు.. ఎలా వస్తుందో..? కూడా తెలియని పరిస్థితుల్లో చాలా మంది పక్షవాతానికి గురి అవుతూ ఉంటారు. సాధారణంగా పక్షవాతం ఎక్కువగా ఒత్తిడి తీవ్రతకి గురి అయినప్పుడు, తట్టుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా పక్షవాతం బారిన పడుతూ ఉంటారు.. అయితే ఈ పక్షవాతాన్ని తగ్గించుకోవడానికి చాలా రకాలుగా చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. అందులో కొంతమంది ఆయుర్వేద పద్ధతులను పాటిస్తే, మరికొంతమంది ఇంగ్లీష్ మెడిసిన్స్ ను ఉపయోగిస్తున్నారు.. అయితే ఏ పద్ధతి పక్షవాతానికి అనువైనదో ఇప్పుడు తెలుసుకుందాం.



పక్ష వాతం తగ్గాలంటే  ఆయుర్వేదం లో ఉన్న కొన్ని పద్ధతులను పాటిస్తే, ఎన్నో లాభాలు కలుగుతాయని, వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేదంలో ఉన్న ఆ పద్ధతులు కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
1. కటుక రోహిణి చూర్ణంను ఆముదంతో కలిపి తాగుతూ ఉన్న పక్షవాతం తగ్గుతుంది.
2. సారాయి తో శొంఠి ని అరగదీసి, అందులో గంధం కలిపి పక్షవాతం ఏర్పడిన చేతులు, కాళ్లపై రాస్తూ ఉండడం వల్ల క్రమంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.
3. ఉల్లిగడ్డ రసం, అల్లం రసం, తేనె తీసుకొని సమపాళ్ళలో కలిపి పూటకు మూడు చెంచాల చొప్పున తాగుతూ ఉంటే పక్షవాతం నయమవుతుంది.
4. చిత్రమూలమును మెత్తగా దంచి, నువ్వుల నూనెలో మరిగించి చేతులు, కాళ్ల పై పూసుకుంటే మంచిదట.
5. దుష్టపాకు,ఉత్తరేణి, పిప్పెంటను సమపాళ్ళలో కలిపి, గానుగ నూనె లో మరిగించి తైలాన్ని తీసి పక్షవాతం వచ్చిన ప్రదేశాలలో రాస్తూ ఉండడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.
6.  వేయించిన ఇంగువను రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని, అందులో తేనె కలిపి కొద్దికొద్దిగా ఇస్తూ ఉన్నా కూడా పక్షవాతం తగ్గుతుంది.


ఇక ఫిజియోథెరపీ  కూడా పక్షవాతం పడ్డవారికి ఒక గొప్ప వరం.. ఇందులో పక్షవాతం తో బలహీనపడ్డ రోగి యొక్క కండరాలను నయం చేసి, రోగిని పూర్వస్థితికి తీసుకొస్తారు. రోగి కూర్చునే, పడుకునే,నిలబడే,నడిచే విధానాలు, మెట్లు ఎక్కడం, దిగడం వంటివి క్రమపద్ధతిలో చేయించడంతో శరీరాన్ని బలపరుస్తారు. అంతేకాకుండా బలహీనమైన కండరాలకు విద్యుత్తుతో మజిల్ సిమ్యులేటర్ చికిత్స కూడా చేస్తారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: