ప్రతి రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లోకి ఒక స్పూన్ ఏలకుల పొడి కలిపి తాగితే..?

kalpana
అన్ని సీజన్లలో లభించే కూరగాయలలో క్యారెట్ ఒకటని చెప్పవచ్చు. ప్రతిరోజు క్యారెట్ ఏదో విధంగా మనం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందే. అయితే క్యారెట్ ను చాలామంది కూరలలో తినడానికి ఇష్టపడరు. వాటిని పచ్చిగా తినడానికి ఎంతో మంది ఇష్టపడతారు.అదేవిధంగా క్యారెట్ ను పచ్చిగా తీసుకున్నప్పుడే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. అదేవిధంగా మరికొందరు జ్యూస్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.ఈ విధంగా క్యారెట్ ప్రతిరోజూ ఏదో ఒక విధంగా మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక రకాల విటమిన్లను అందించడంతోపాటు కంటిచూపును మెరుగుపరుస్తుంది.                         

క్యారెట్లో విటమిన్ ఏ తో పాటు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌, సోడియం అధికమొత్తంలో లభిస్తుంది.విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల మనలో ఉన్న దృష్టి లోపాలను నివారించడంతో పాటు రేచీకటి సమస్యను నివారించి దృష్టిని మెరుగు పరుస్తుంది. ఇందులో ఉన్నటువంటి సోడియం శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి రక్తపోటు సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల సూర్యుడి నుంచి మన చర్మాన్ని కాపాడి మరింత కాంతివంతంగా తయారు చేస్తుంది.

ప్రతి రోజూ ఒక గ్లాసు చొప్పున క్యారెట్ జ్యూస్ తయారు చేసుకుని అందులో ఒక టీ స్పూన్ ఏలకుల పొడి, పటిక బెల్లం కలుపుకుని తాగడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా నిరోధిస్తుంది. నీరసం, అలసట వంటివి తగ్గిపోయి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. క్యారెట్ కొరికి  నమిలి తినడం ద్వారా దంతాలు, చిగుళ్ళు గట్టిపడి రక్తస్రావం కాకుండా కాపాడటమే కాకుండా నోటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను తొలగించి నోటి దుర్వాసనను పోగొడుతుంది.ఈ విధంగా ప్రతి రోజు ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: